రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్

పాపులర్ యంగ్ బాలీవుడ్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షల్లో తన కొడుక్కి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Ranbir Kapoor tested positive for Covid-19 : పాపులర్ యంగ్ బాలీవుడ్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షల్లో తన కొడుక్కి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

‘‘కరోనా వల్ల రణ్‌బీర్ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు.. మెడిసిన్స్ తీసుకుంటూ మెల్లగా రికవరీ అవుతున్నాడు.. తీసుకోవలసిన జాగ్రత్తలు పాటిస్తున్నాడు’’ అని నీతూ కపూర్ పోస్ట్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇందులో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, అలియా భట్, మౌనీ రాయ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.