Pushpa 2 : అన్‌స్టాపబుల్ షోలో పుష్ప 2 స్టోరీ లీక్ చేసిన రణబీర్ కపూర్..!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అన్‌స్టాపబుల్ షోలో పుష్ప 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప సీక్వెల్‌లో..
- gum 95921
- Published On : November 24, 2023 / 11:53 AM IST
Ranbir Kapoor leaks Allu Arjun Pushpa 2 story in Unstoppable show
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జాతీయ అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీస్ లో సైతం పుష్ప 2 పై ఆసక్తి నెలకుంది. ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రీసెంట్ గా పుష్ప 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి ‘యానిమల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఈ మూవీ టీం బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్య పుష్ప 2 గురించి రష్మికని ప్రశ్నించగా, రణబీర్ కలుగజేసుకొని.. పుష్ప 2 స్టోరీ చెప్పు అంటూ అడిగారు. రష్మిక మాత్రం సినిమా కథని చెప్పను అంటూ చెప్పుకొచ్చింది. ఇక రణబీర్ పుష్ప 2 గురించి ‘యానిమల్’ మూవీ సెట్స్ లో జరిగిన విషయాలను చెప్పుకొచ్చారు.
Also read : Rashmika : షూటింగ్‌కి బ్రేక్ వస్తే రష్మిక ఎక్కడికి వెళ్తుందో తెలుసా..?
రణబీర్ మాట్లాడుతూ.. “నేను, సందీప్ వంగా పుష్ప సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్స్. యానిమల్ సెట్స్ లో కూర్చొని పుష్ప 2 కథ ఏమైంటుందని మాకు మేమే కొన్ని కథలు అనేసుకునేవాళ్ళం. శ్రీవల్లి ప్రెగ్నెంట్ అవ్వడం, ఆమె బిడ్డ చనిపోవడంతో పుష్ప రివెంజ్ తీసుకుంటాడని నేను చెప్పడం. పుష్ప స్నేహితుడు కూడా చనిపోతాడేమో అని సందీప్ చెప్పడం. ఇలా మాకు మేమే కొన్ని కథలు అనుకునేవాళ్లం” అంటూ వాళ్ళు రాసుకున్న పుష్ప 2 స్టోరీని లీక్ చేశారు. ఇక ఇది చూసిన ఆడియన్స్.. వీళ్ళు కూడా మనలా పుష్ప 2 పై ఇంత ఆసక్తితో ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు.
