Dhurandhar 2 : సరికొత్త రికార్డ్ సెట్ చేసిన ధురంధర్.. ఆ లిస్ట్ లో ఫస్ట్ సినిమా..

ధురంధర్ 2 సినిమా రెండు వేల కోట్ల కలెక్షన్లు సాధించకుండానే మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. (Dhurandhar 2)

  • Published On : April 10, 2026 / 11:20 PM IST

Dhurandhar 2

Dhurandhar 2 : ధురంధర్ ఈ పేరు బాలీవుడ్ సినిమా ఉన్నంత కాలం నిలిచిపోయే పేరు. బాక్సాఫీస్ దగ్గర పర్మినెంట్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉండే పేరు. ఈ క్రెడిట్ అంతా 1600 కోట్ల ప్లస్ కలెక్షన్లు సాధించినందుకు కాదు, పాన్ ఇండియా వైడ్ గా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యినందుకు కాదు. ఇంకా 2 వేల కలెక్షన్లు రాబట్టకుండానే లేటెస్ట్ గా ధురంధర్ కొత్త రికార్డ్ సెట్ చేసింది.

ధురందర్ సినిమా హవా ఇంకా బాలీవుడ్ లో కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ వీక్ లో ఉన్నంత కలెక్షన్ల స్పీడ్ లేకపోయినా నిదానంగా కలెక్షన్లు రాబడుతూనే సూపర్ హిట్ టాక్ తో కంటిన్యూ అవుతూనే ఉంది ధురంధర్ 2 సినిమా. 1600కోట్ల ప్లస్ కలెక్షన్లతో థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తున్న ధురంధర్ 2. లేటెస్ట్ గా బాలీవుడ్ లో మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Also Read : Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ ‘రాకా’ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా? ప్రభాస్ ని మించి..

ధురంధర్ 2 సినిమా రెండు వేల కోట్ల కలెక్షన్లు సాధించకుండానే మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓన్లీ హిందీలోనే 1000 కోట్లు వసూల్ చేసిన సినిమాగా బాలీవుడ్ లో, ఇండియాలోనే ఫస్ట్ మూవీగా రికార్డ్ సెట్ చేసింది. ఇప్పటి వరకూఎన్ని సినిమాలు రిలీజైనా పాన్ ఇండియా వైడ్ గా, ఓవర్సీస్ వైజ్ గా కలెక్షన్లు రాబట్టినా, ధురంధర్ 2 మాత్రం ఓన్లీ హిందీలోనే 1000 కోట్లు రాబట్టిన మొదటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ సెట్ చేసిన మొదటి సినిమాగా ధురంధర్ 2 నిలిచింది.

ఇప్పటికీ రోజుకి దాదాపు 10 కోట్లు కలెక్ట్ చేస్తున్న ధురంధర్ 2 త్వరలోనే 2 వేల కోట్ల మైల్ స్టోన్ ని కూడా రీచ్ అయ్యి ఆ రికార్డ్ ని కూడా సొంతం చేస్కోవాలని కోరుకుంటున్నారు ఫాన్స్ . నిజానికి పాన్ ఇండియా వైడ్ గా అనుకున్నది అనుకున్నట్టు రిలీజైతే ఇప్పటికి ధురంధర్ 2 సినిమా 2 వేలకోట్ల కలెక్షన్ లిస్ట్ లో యాడ్ అయ్యేది.

Also Read : Pawan Kalyan : జైలర్ 2లో పవన్ కళ్యాణ్ ఫిక్స్.. తమిళ మీడియాలో వైరల్.. ఇదే జరిగితే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..

కానీ తెలుగులో ఫుల్ హైప్ ఉన్నా ఈ సినిమా ప్రీమియన్స్ క్యాన్సిల్ అవ్వడం, ఫస్ట్ 2 డేస్ షోస్ ఆగిపోవడంతో అప్పటికి సాలిడ్ ఓపెనింగ్స్ మిస్ అయ్యింది ధురంధర్ 2 మూవీ. ఆదిత్యధర్ డైరెక్షన్లో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ బాలీవుడ్ ని మరోసారి నిలబెట్టింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ పార్ట్ వెయ్యికోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ కి ఊపిరిస్తే ఈ ధురంధర్ 2 రికార్డులు సెట్ చెయ్యడమే పనిగా పెట్టుకుని కంటిన్యూ అవుతోంది.