×
Ad

Dhurandhar 2 : ‘ధురంధ‌ర్ 2’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. గూస్ బంప్స్‌..

ధురంధ‌ర్ 2 టీజ‌ర్‌ను (Dhurandhar 2) చిత్ర బృందం విడుద‌ల చేసింది.

Dhurandhar 2 : బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన స్పై థ్రిల్లర్ మూవీ ‘ధురంధర్’ . ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎన్ని సంచ‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంద‌ని అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు.

దీంతో ధురంధ‌ర్ 2 చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ధురంధ‌ర్ 2 చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తొలి భాగం హిందీలో మాత్ర‌మే విడుద‌ల కాగా.. రెండో పార్ట్ మాత్రం హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Peddi : రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ పోస్ట్ పోన్ కానుందా? మార్చిలో రాన‌ట్లేనా? ద‌స‌రాకేనా?

సారా అర్జున్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.