Peddi : రామ్‌చరణ్ పెద్ది మూవీ పోస్ట్ పోన్ కానుందా? మార్చిలో రానట్లేనా? దసరాకేనా?
రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై (Peddi)ఓ రేంజ్ హైప్ క్రియేట్ అవుతోంది.
Gossip Garage Ram Charan Peddi likely to be postponed
Peddi : రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే పెద్ది మూవీని దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
అయితే ముందుగా సమ్మర్ హాలిడేస్‌లో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి, మార్చిలో రిలీజ్ చేసి బాక్సాఫీస్‌లో భారీ కలెక్షన్లు సాధించాలని స్కెచ్ వేశారట. అయితే సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉందట. దీంతో మార్చి నుంచి దసరాకు రిలీజ్ డేట్ షిఫ్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది.
FAUZI : వచ్చే సంక్రాంతి బరిలో ఫౌజీ.!?
పెద్ది మూవీకి సంబంధించి..రామ్‌చరణ్ పార్ట్ వరకు ఈ సమ్మర్లోనే ఆయన వర్క్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయట. ఆ తర్వాత చరణ్ వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ చేస్తాడని అంటున్నారు. చరణ్..సుకుమార్ కాంబినేషన్లో వచ్చే సినిమా స్టోరీపై టాలీవుడ్లో పెద్ద చర్చే జరుగుతుంది. చరణ్ కెరీర్లో 17వ మూవీగా రాబోతున్న ఈ సినిమా స్టోరీ చాలా క్లాస్‌గా ఉండబోతోందట.
చరణ్ పెద్ది సినిమా పుల్ మాస్ ఎంటర్టైనర్గా రాబోతుంది. అయితే పుష్ప లాంటి మాస్ మూవీ చేసిన సుకుమార్ ఇప్పుడు చరణ్‌తో క్లాస్ సినిమా చేయాలుకుంటున్నట్లు టాక్. ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ అనే టాక్ వినిపిస్తుంది. అయితే రామ్‌చరణ్ ఫ్యామిలీ జోనర్‌తో ఎలా అలరిస్తాడో చూడాలంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతోందట.
