Prabhas Vs Ranveer Singh : అప్పుడు షారుఖ్.. ఇప్పుడు రణవీర్ సింగ్.. ప్రభాస్ తో పోటీ.. ‘రాజాసాబ్’ సంగతేంటి?

ప్రభాస్ కి పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రాబోతున్నాడు.

Prabhas Vs Ranveer Singh : అప్పుడు షారుఖ్.. ఇప్పుడు రణవీర్ సింగ్.. ప్రభాస్ తో పోటీ.. ‘రాజాసాబ్’ సంగతేంటి?

Prabhas Vs Ranveer Singh

Updated On : July 6, 2025 / 5:16 PM IST

Prabhas Vs Ranveer Singh : ప్రభాస్ ఇటీవల కల్కి, కన్నప్ప సినిమాలతో ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను అలరించాడు. నెక్స్ట్ రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రభాస్ కి మళ్ళీ నార్త్ లో గట్టి పోటీ ఎదురవ్వబోతుంది.

ప్రభాస్ కి పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రాబోతున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా దురంధర్. నేడు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి డిసెంబర్ 5న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Kamal Haasan : స్టార్ హీరోయిన్ తో హోటల్ లో.. డైరెక్ట్ గా వచ్చి అందరిముందు కమల్ ని తిట్టిన మొదటి భార్య.. దెబ్బకు హీరోయిన్ ని మార్చేసి..

దీంతో నార్త్ లో రాజాసాబ్ కి దురంధర్ గట్టి పోటీ ఇవ్వబోతుంది. గతంలో సలార్ కి పోటీగా షారుఖ్ డంకి సినిమా రిలీజ్ అయి గట్టి పోటీ ఇచ్చింది. అప్పుడు కూడా సలార్ తెలుగులో పెద్ద హిట్ అయినా నార్త్ లో పర్వాలేదనిపించింది. మరి ఈసారి రాజాసాబ్ వర్సెస్ దురంధర్ పోటీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

రణవీర్ సింగ్ దురంధర్ గ్లింప్స్ ఇక్కడ చూసేయండి..

Also Read : Producer SKN – Allu Sirish : అల్లు శిరీష్ కి హిట్ ఇస్తా.. అల్లు అర్జున్ తో సినిమా తీస్తా.. నిర్మాత SKN కామెంట్స్..