Kamal Haasan : స్టార్ హీరోయిన్ తో హోటల్ లో.. డైరెక్ట్ గా వచ్చి అందరిముందు కమల్ ని తిట్టిన మొదటి భార్య.. దెబ్బకు హీరోయిన్ ని మార్చేసి..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో కూడా కొన్నాళ్ళు కమల్ ప్రేమాయణం సాగించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Kamal Haasan
Kamal Haasan : లోక నాయకుడుగా కమల్ హాసన్ తన సినిమాలతో, తన నటనతో ఇప్పటికి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. సినిమాల పరంగా ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్, కమల్ వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాలు, వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కమల్ హాసన్ మొదట వాణి గణపతి అనే డ్యాన్సర్ ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సారికని పెళ్లి చేసుకున్నారు. సారికకు విడాకులు ఇచ్చి గౌతమితో కొన్నాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఆమెతో కూడా విడిపోయారు.
అయితే మధ్యలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో కూడా కొన్నాళ్ళు కమల్ ప్రేమాయణం సాగించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ.
1981 లో కమల్ హాసన్ తన సినిమాలో హీరోయిన్ గా రేఖని తీసుకున్నారు. అప్పటికే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఉందట. షూటింగ్ కి రేఖ, మరి కొంతమంది మూవీ యూనిట్ చెన్నైకి రాగా చోళా షెరటాన్ అనే హోటల్ లో దిగారు అంతా. కమల్ హాసన్ కూడా అప్పుడు అదే హోటల్ లో ఉన్నారట. ఆ టైంలో కమల్ హాసన్ మొదటి భార్య వాణి వచ్చి అందరి ముందు కమల్ ని తిట్టారంట. ఆ తర్వాత రేఖని ఆ సినిమా నుంచి హీరోయిన్ గా తప్పించి వేరే హీరోయిన్ ని తీసుకున్నారు.
వాణి వల్లే రేఖని ఆ సినిమా లోంచి తీసేయాల్సి వచ్చిందని, కమల్ హాసన్ – వాణికి అప్పట్నుంచే విబేధాలు మొదలయ్యాయని అప్పుడు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 1988 లో కమల్ వాణికి విడాకులు ఇచ్చి అదే ఏడాది చివర్లో సారికని వివాహం చేసుకున్నాడు. మొత్తానికి కమల్ జీవితంలో ముగ్గురు మహిళలే అని అంతా అనుకుంటారు. కానీ హీరోయిన్ రేఖ కూడా కమల్ జీవితంలో కొన్నాళ్ళు ఉందని, ఆవిడ వల్లే కమల్ కి మొదటి భార్యతో విడాకులు అయ్యాయని అప్పటి సమాచారం.