West Bengal: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. బీజేపీలోకి 17 మంది TMC ఎంపీలు? రంగంలోకి సుప్రీంకోర్టు!
పశ్చిమ బెంగాల్ (West Bengal)రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Disqualification notice to rebel TMC MPs who joined the West Bengal BJP.
- బీజేపీలో 17 మంది ఎంపీలు
- పార్టీ ఫిరాయింపుల చట్టం చిక్కులు
- సెప్టెంబర్ 22 వరకు గడువు
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి తిరుగుబాటు చేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో చేరిన 20 మంది ఎంపీల్లో ఏకంగా 17 మంది బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. రెబల్ ఎంపీ జగదీశ్ చంద్ర బర్మా బసునియా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలతో బెంగాల్‌తో పాటు ఢిల్లీ స్థాయిలోనూ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
పార్టీ ఫిరాయింపుల చట్టం చిక్కులు:
మొత్తం 20 మంది రెబల్ ఎంపీలలో ముగ్గురు మైనారిటీ నాయకులు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేకపోవడంతోనే వీరంతా మొదట NCPIలో విలీనమైనట్లు బసునియా వెల్లడించారు. 17 మంది బీజేపీలో చేరితే మూడింట రెండు వంతుల బలం ప్రాతిపదికన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇది బసునియా వ్యక్తిగత అభిప్రాయమని, సమిష్టి నిర్ణయం కాదని తోటి రెబల్ ఎంపీలు ఖండించడం గమనార్హం.
న్యాయపోరాటం.. బీజేపీ వ్యూహం:
ప్రస్తుతం ఈ 20 మంది ఎంపీలపై అనర్హత వేటు వేయాలని టీఎంసీ నాయకత్వం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరడంతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. సెప్టెంబర్ 22 వరకు ఎంపీలకు గడువు ఇచ్చిన స్పీకర్ నోటీసులపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు తమ వద్దకు ఎంపీలు చేరుతున్నారనే అంశంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ప్రస్తుతం ఎవరూ చేరడం లేదని బెంగాల్(West Bengal) బీజేపీ స్పష్టం చేసింది.
