Central Government: లక్షలాది మంది కార్మికులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా డీఏ పెంపు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
పండుగ సీజన్‌కు ముందు దేశంలోని లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) తీపి కబురు అందించింది.
Centre revises minimum wage rates for workers by enhancing variable dearness allowance
Central Government: పండుగ సీజన్‌కు ముందు దేశంలోని లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయం, నిర్మాణం, నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న అన్-స్కిల్డ్, స్కిల్డ్ కార్మికుల కరవు భత్యం (డీఏ)ను సవరిస్తూ కనీస వేతనాలను భారీగా పెంచింది. ఈ కొత్త వేతనాలు అక్టోబర్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా, ఇండస్ట్రియల్ వర్కర్స్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI-IW) ఆధారంగా ఈ డీఏ పెంపును చేపట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.
వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో కొత్త వేతనాల వివరాలు:
ఈ వేతన పెంపును కార్మికుల నైపుణ్యం, వారు పనిచేసే ప్రాంతాల ఆధారంగా విభజించారు. నిర్మాణ రంగంలో ఏరియా A లోని అన్-స్కిల్డ్ కార్మికులకు రోజువారీ వేతనం రూ.840 కాగా, అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు రోజుకు రూ.1,111 గా నిర్ణయించారు. అలాగే వ్యవసాయ రంగంలో ఏరియా A లో అన్-స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.537 కాగా, హైలీ స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.705 చొప్పున వేతనం లభించనుంది.
ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏ సవరణ:
ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకునేందుకు ప్రతి ఏటా ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో కేంద్ర ప్రభుత్వం(Central Government) కనీస వేతనాలను సవరిస్తుంది. సీపీఐ-ఐడబ్ల్యూ ఇండెక్స్ 424.80 నుంచి 431.42 పాయింట్లకు పెరగడంతో, ఈ 6.62 పాయింట్ల వృద్ధి ఆధారంగా కొత్త డీఏను ఖరారు చేశారు. పండుగల వేళ పెరిగిన వేతనాలు తమ కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయని కార్మిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
