Rashi Khanna: అలా చేస్తే ఫేమ్ వస్తుంది.. మర్యాద రాదు.. రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో పీఆర్ టీంల పై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ బ్యూటీ రాశి ఖన్నా(Rashi Khanna).
- V Santhosh Kumar
- Published On : March 29, 2026 / 11:51 AM IST
Raashi Khanna Shocking Comments About PR Teams
Rashi Khanna: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కంటెంట్ కంటే పీఆర్ (PR) టీంల హవానే ఎక్కువగా నడుస్తోంది. చిన్న హీరోలను సైతం సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ఇచ్చి స్టార్‌లుగా మార్చేసే శక్తి ఈ టీంలకు ఉంది. దాదాపు ప్రతి ఒక్క సినీ సెలబ్రిటీ తమకంటూ ఒక ప్రత్యేక పీఆర్ బృందాన్ని ఏర్పాటు చేసుకుని, నిరంతరం వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ఈ ట్రెండ్‌పై టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా(Rashi Khanna) సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Jatayu: ఇంద్రగంటి భారీ స్కెచ్.. రోషన్ మేకతో ‘జఠాయు’.. విజువల్ వండర్‌గా రామాయణ గాథ!
పీఆర్ టీంల పనితీరుపై ఆమె సూటిగా స్పందిస్తూ తన మనసులోని మాటను బయటపెట్టింది. పీఆర్ టీంలను మైంటైన్ చేయడం వల్ల ఏ స్టార్ కి అయినా తాత్కాలికంగా ఫేమ్ రావచ్చు కానీ, గౌరవం మాత్రం రాదని రాశీ ఖన్నా అభిప్రాయపడింది. “మర్యాద అనేది మనం చేసే పని, పడే కష్టం, చూపించే ప్రతిభను బట్టే వస్తుంది తప్ప.. పీఆర్ టీంలు సృష్టించే హైప్ వల్ల రాదు” అని ఆమె కుండబద్దలు కొట్టింది.
అందుకే తాను ఎలాంటి పీఆర్ టీంలను పెట్టుకోలేదని, కేవలం తన పని మీద మాత్రమే నమ్మకంతో ముందుకు సాగుతున్నానని స్పష్టం చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఇమేజ్ కోసం అందరూ పాకులాడుతున్న ఈ రోజుల్లో, రాశీ ఖన్నా చేసిన ఈ కామెంట్స్ ఆమె వ్యక్తిత్వాన్ని చాటుతున్నాయి. కాగా, రాశీ ఖన్నా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఆమె కెరీర్ మరోసారి ఊపందుకుంది.
