Rashmika Mandanna : కన్నడ పరిశ్రమలో తనపై నిషేధం గురించి రష్మిక కామెంట్స్..
గత కొన్నిరోజులుగా కన్నడ సినీ ప్రేక్షకులు స్టార్ హీరోయిన్ 'రష్మిక మందన'ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఆమెను మీడియా విలేకర్లు ప్రశ్నించగా, ఆమె బదులిచ్చింది.
- gum 95921
- Published On : December 8, 2022 / 09:47 PM IST
Rashmika comments on her ban in Kannada industry
Rashmika Mandanna : గత కొన్నిరోజులుగా కన్నడ సినీ ప్రేక్షకులు స్టార్ హీరోయిన్ ‘రష్మిక మందన’ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ అమ్మడుని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’ చూశారా అని ప్రశ్నించగా.. లేదు చూడలేదు అంటూ బదులిచ్చింది. అయితే కాంతార తెరకెక్కించిన రిషబ్ శెట్టి దర్శకత్వంతోనే రష్మిక సినీ పరిశ్రమకు పరిచయమైంది.
Rashmika Mandanna: స్పెషల్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేసిందంటే..?
కాంతార మూవీపై ప్రభాస్, రజినీకాంత్ వంటి పక్క ఇండస్ట్రీ స్టార్స్ ప్రశంసలు చేస్తుంటే.. సొంత ఇండస్ట్రీ హీరోయిన్ అయిన రష్మిక చూడలేదు అని కామెంట్స్ చేయడంతో వివాదం రాచుకుంది. దీంతో రష్మికను కన్నడ సినిమా నుంచి బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో నినాదాలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఆమెను మీడియా విలేకర్లు ప్రశ్నించగా, ఆమె బదులిచ్చింది.
“కన్నడ చిత్ర పరిశ్రమ నాపై ఎలాంటి నిషేధం విధించలేదు. కాంతార చిత్ర విషయంలో నాపై కొంతమంది అత్యుత్సాహం చూపించారు. విడుదల సమయంలో సినిమా చూడలేకపోయా, ఆ తరువాత చూసి చిత్ర బృందానికి మెసేజ్ కూడా పెట్టాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. ప్రొఫెషన్ పరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం నా బాధ్యత. అంతేగాని నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను” అంటూ వెల్లడించింది.
