Rashmika Mandanna: స్పెషల్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేసిందంటే..?

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అందరు హీరోలు కోరుకుంటున్న హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరే వినిపిస్తుంది. అంతలా తన గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌ను రష్మికతో చేయించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Rashmika Mandanna: స్పెషల్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేసిందంటే..?

Rashmika Mandanna Stuns Producers For Special Song Remuneration

Updated On : December 5, 2022 / 12:44 PM IST

Rashmika Mandanna: ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అందరు హీరోలు కోరుకుంటున్న హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరే వినిపిస్తుంది. అంతలా తన గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారింది. తెలుగులో ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రలో అమ్మడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Also Read: Rashmika Mandanna: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న స్టార్ బ్యూటీ.. నిజమేనా?

ఇక ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటించేందుకు రష్మిక రెడీ అవుతోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను అందాల భామ రష్మిక మందన్నతో చేయించాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. రష్మిక ఈ స్పెషల్ సాంగ్ చేస్తే, తమ సినిమా నేషన్‌వైడ్‌గా గుర్తింపును తెచ్చుకుంటుందని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.

Also Read: Rashmika Mandanna : రష్మికను బ్యాన్ చెయ్యాలి.. గుర్తుందా శీతాకాలం దర్శకుడు స్పందన..

అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ రష్మికను అప్రోచ్ అయ్యారని.. కానీ వారికి రష్మిక దిమ్మతిరిగే షాకిచ్చిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం రష్మిక ఏకంగా రూ.4 కోట్ల మేర రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ప్రస్తుతం తనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే అమ్మడు ఈ రేంజ్‌లో డిమాండ్ చేసిందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి రష్మిక డిమాండ్‌కు SSMB28 మేకర్స్ ఓకే చెబుతారా.. లేక మరొక బ్యూటీతో ఈ స్పెషల్ సాంగ్ చేయిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.