Rashmika Mandanna : రష్మిక బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
గత సంవత్స్రం బాలీవుడ్ సినిమా ఆఫర్ దక్కించుకుంది రష్మిక. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న 'మిషన్ మజ్ను' చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ సినిమాతో తొలిసారి హిందీ
- Saketh U
- Updated on- November 4, 2021 / 07:20 AM IST
Rashmika
Rashmika Mandanna : కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో ‘ఛలో’ సినిమాతో అందర్నీ మెప్పించింది. స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి మంచి విజయాలు సాధించి కుర్రకారు మతిని పోగొట్టింది. తన అందంతో, తన అభినయంతో అభిమానుల నుంచి ‘నేషనల్ క్రష్’ బిరుదుని కూడా సంపాదించుకుంది రష్మిక. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ని పెంచుకుంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అందరి హీరోయిన్స్ లాగే సౌత్ లో స్టార్ అవ్వగానే బాలీవుడ్ ఎంట్రీ కోసం చూసింది రష్మిక.
Puneeth Rajkumar : పునీత్ మరణంతో మరో అభిమాని మృతి
దీంతో గత సంవత్స్రం బాలీవుడ్ సినిమా ఆఫర్ దక్కించుకుంది రష్మిక. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ సినిమాతో తొలిసారి హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది రష్మిక. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ‘మిషన్ మజ్ను’ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు చిత్ర బృందం. ‘మిషన్ మజ్ను’ సినిమా 2022 మే 13న వేసవి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని రష్మిక కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక బాలీవుడ్ లో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
