Rashmika Mandanna : రష్మికని బాలీవుడ్ హీరో ఇబ్బంది పెట్టాడా? వైరల్ అవుతున్న వీడియో..
ఈ ఈవెంట్లో రష్మిక షాహిద్, కృతి సనన్ తో కలిసి సందడి చేసింది. (Rashmika Mandanna)
- Saketh U
- Published on- May 18, 2026 / 02:55 PM IST
Rashmika Mandanna
Rashmika Mandanna : రష్మిక మందన్న బాలీవుడ్ లో కాక్ టైల్ 2 అనే సినిమాలో నటించింది. షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరో. నిన్న ఆదివారం రాత్రి ముంబైలో ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రష్మిక మందన్న పాల్గొంది. ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ కృతి సనన్ కూడా పాల్గొంది. ఈ ఈవెంట్లో రష్మిక షాహిద్, కృతి సనన్ తో కలిసి సందడి చేసింది.
ఈవెంట్లో ఈ ముగ్గురు కలిసి క్లోజ్ గా ఉన్నారు, ఫొటోలు దిగారు. షాహిద్ కృతి, రష్మికపై చేతులు కూడా వేసి ఫొటోలు దిగారు. అయితే ఓ వీడియోలో షాహిద్ రష్మిక భుజంపై చెయ్యి వేయబోతుండగా రష్మిక అసహనానికి గురయి తప్పించుకుంది. దీంతో షాహిద్ చెయ్యి వెయ్యలేదు. అయితే అదే సమయంలో పక్కనున్న మరో వ్యక్తి మాత్రం రశ్మికపై చెయ్యి వేసాడు.
అంతకుముందే షాహిద్ రష్మిక భుజంపై చేయి వేసి మరీ ఫొటోలు దిగాడు, ఇప్పుడు ఎందుకు రష్మిక ఇలా అసహనానికి గురయింది అని సందేహిస్తునారు. ఈ వీడియోలో చెయ్యి వేయడమే కాకుండా షాహిద్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా? అందుకే రష్మిక అసహనానికి గురైందా? అసలు అక్కడ ఏం జరిగింది అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చిస్తున్నారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.
బాలీవుడ్ మూవీ ‘కాక్టెయిల్-2’ ప్రమోషన్లలో షాహిద్ కపూర్ తీరుతో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు. షాహిద్ తన భుజంపై చేయి వేయగానే అన్‌కంఫర్టబుల్‌గా ఫీలై వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ ఏదో జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి… pic.twitter.com/FGza2sYnR8
— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026
