NTR Neel : రెడీగా ఉండండి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్.. అర్ధరాత్రి ఎన్ని గంటలకు? ఎక్కడ?
తాజాగా ఎన్టీఆర్ నీల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎక్కడ రిలీజ్ చేస్తారు అని ప్రకటించారు. (NTR Neel)
NTR Neel
NTR Neel : ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. అధికారికంగా ఈ సినిమా టైటిల్ ప్రకటించకపోయినా డ్రాగన్ అనే పేరు వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి లీక్ ఫొటోలు తప్ప అధికారికంగా ఎన్టీఆర్ పోస్టర్ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. సినిమా షూటింగ్ ఏమో వాయిదాలు పడుతూ వస్తుంది.
కానీ ఈ సినిమాపై, ఎన్టీఆర్ లుక్స్ చూసి భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఇంకా సంవత్సరం ఆగాలా అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తామని అధికారికంగానే ప్రకటించారు.
Also Read : Divyabharathi : అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తున్న దివ్యభారతి.. ఫొటోలు..
తాజాగా ఎన్టీఆర్ నీల్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎక్కడ రిలీజ్ చేస్తారు అని ప్రకటించారు. ఈ గ్లింప్స్ ని మే 19 అర్ధరాత్రి 11 గంటల 52 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే 20.5937° N, 78.9629° E లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ని ప్రకటించారు.
గూగుల్ మ్యాప్స్ లో 20.5937° N, 78.9629° E దీన్ని వెతికితే ఇండియాలో జియోగ్రాఫికల్ గా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ చూపిస్తుంది.మహారాష్ట్రలోని వాద్రా అనే ఓ ఊరికి దగ్గర్లో ఈ లోకేషన్ చూపిస్తుంది. అక్కడ ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తారేమో అని సమాచారం. ఇక టీమ్ ఇచ్చే ఎలివేషన్స్ తో ఈ గ్లింప్స్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ పుట్టిన రోజుకి భారీగానే ప్లాన్ చేయబోతున్నారు.
Also Read : Sobhita Dhulipala : సూట్లో స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో శోభిత ధూళిపాళ లేటెస్ట్ ఫొటోలు..
20.5937° N, 78.9629° E
A nationwide destruction protocol begins 🔥
T-MINUS 08 ⚡
May 19 • 23:52 IST#NTRNeel First Glimpse strikes in selected theatres & digitally 🔥
— #NTRNeel (@NTRNeelFilm) May 18, 2026
