Rashmika Mandanna : ఇండియా నుంచి ఆ గౌరవం అందుకున్న వ్యక్తి నేనే.. రష్మిక మందన్న!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రేటిస్ కూడా రష్మిక ఫ్యాన్స్ అయ్యిపోతున్నారు. నందమూరి బాలకృష్ణ, క్రికెట్ ప్లేయర్ శుబ్‌మాన్‌ గిల్ కూడా ఈ అమ్మడు తమ క్రష్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి ఫాలోయింగ్ చూసి అరుదైన గౌరవం అంది వచ్చింది.

Rashmika Mandanna is brand advocate to japanese fashion brand Onitsuka Tiger

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రేటిస్ కూడా రష్మిక ఫ్యాన్స్ అయ్యిపోతున్నారు. నందమూరి బాలకృష్ణ, క్రికెట్ ప్లేయర్ శుబ్‌మాన్‌ గిల్ కూడా ఈ అమ్మడు తమ క్రష్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి ఫాలోయింగ్ చూసి అరుదైన గౌరవం అంది వచ్చింది. జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘Onitsuka Tiger’కి బ్రాండ్ అడ్వొకేట్‌గా వ్యవహరించే అవకాశం అందుకుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ వేసింది.

Rashmika Mandanna : మొన్న బాలకృష్ణ, ఇవాళ శుబ్‌మాన్‌ గిల్.. రష్మిక ఫాలోయింగ్ మాములుగా లేదుగా!

‘కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నా. ఐకానిక్ జపనీస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘Onitsuka Tiger’కి నేను బ్రాండ్ అడ్వొకేట్‌గా వ్యవహరించబోతున్నా. భారతదేశపు నుంచి ఈ గౌరవం అందుకున్న మొదటి వ్యక్తి నేనే అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. బ్రాండ్ అంబాసిడర్ విన్నాము, ఈ బ్రాండ్ అడ్వొకేట్‌ ఏంటని ఆలోచిస్తున్నారా? అంబాసిడర్‌కి ఆ బ్రాండ్ తరుపు నుంచి అధికారిక గుర్తింపు ఉంటుంది. కానీ అడ్వొకేట్‌కి గుర్తింపు ఉండదు.

Rashmika Mandanna : ఉర్ఫీ జావేద్‌ని ఫాలో అవుతున్న రష్మిక.. బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజెన్లు కామెంట్లు!

ఇక రష్మిక సినిమా విషయాలకి వస్తే.. ప్రస్తుతం రష్మిక నార్త్ టు సౌత్ వరుస సినిమాలు చేస్తుంది. హిందీలో రణ్‌బీర్ సరసన ‘యానిమల్’ సినిమాలో నటిస్తుండగా, తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ చిత్రం ఆగష్టు లో రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తీ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.