Rashmika Mandanna : అందరి ముందు హీరోతో రష్మిక లిప్ కిస్.. ఒక్క పాటలోనే ఇన్ని లిప్ కిస్‌లా? యానిమల్ సాంగ్ చూశారా?

పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ఈ పాటని రిలీజ్ చేశారు. అమ్మాయే.. అని సాగే ఈ సాంగ్ లో రణబీర్ కపూర్, రష్మిక లిప్ కిస్సులతో రెచ్చిపోయారు.

Rashmika Lip Kiss with Ranbir Kapoor in Animal Movie Song

Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం రణబీర్ కపూర్(Ranbir Kapoor) తో ‘యానిమల్’(Animal) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇటీవల మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసి మొదటి పాటని రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ఈ పాటని రిలీజ్ చేశారు. అమ్మాయే.. అని సాగే ఈ సాంగ్ లో రణబీర్ కపూర్, రష్మిక లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. ఈ పాట చూస్తుంటే హీరో రష్మికని ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో వాళ్ళ ముందే రష్మికకు ముద్దు పెట్టి ఆ తర్వాత ఇద్దరూ సొంత ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతారు. ఫ్లైట్ లో కూడా ఇద్దరూ ఫ్లైట్ ని నడిపిస్తునే లిప్ కిస్ ఇచ్చుకోవడం గమనార్హం. ఆ తర్వాత ఇద్దరూ ఓ గుడికి వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఇక ఈ సాంగ్ చూస్తుంటే అర్జున్ రెడ్డి వైబ్స్ కనిపిస్తున్నాయి.

Also Read : Naveen Polishetty : తమిళ్ మల్టీస్టారర్ మిస్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి.. నవీన్ ప్లేస్ లో..

పాటలోనే రష్మిక ఇన్ని లిప్ కిస్సులు ఇచ్చిందంటే సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో అని లెక్కలేసుకుంటున్నారు. సాంగ్ మాత్రం మెలోడీగా బానే ఉందనిపిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు