Rashmika : రష్మికని ఇంకో పెళ్లికి.. ఓకే చెప్పొద్దంటూ సలహా ఇస్తున్న రణబీర్..
రష్మికని ఇంకో పెళ్లికి ఒకే చెప్పొదంటూ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సలహా ఇస్తున్నాడు.
- gum 95921
- Updated on- October 28, 2023 / 09:17 AM IST
Rashmika Mandanna Ranbir Kapoor Animal Movie Second song
Rashmika : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు సౌత్ టు నార్త్ స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్, తమిళంలో ఒక సినిమా, తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. హిందీలో నటించిన ‘యానిమల్’ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా టీజర్, సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
ఇటీవల ఒక సాంగ్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ లో బాగా రీచ్ వచ్చింది. తాజాగా సెకండ్ ని కూడా రిలీజ్ చేశారు. మొదటి సాంగ్ లో ముద్దులతో రెచ్చిపోయిన రణబీర్, రష్మిక.. సెకండ్ సాంగ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో కనిపించారు. భార్య భర్తల మధ్య గొడవలు, పిల్లలు, ఫ్యామిలీతో సాంగ్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సాంగ్ చివరిలో రష్మికతో రణబీర్ మాట్లాడుతూ.. ‘నేను తిరిగి రాకపోతే, నువ్వు ఇంకో పెళ్ళికి ఒకే చెప్పొద్దు’ అంటూ వెళ్లిపోవడంతో సాంగ్ ఎమోషనల్ గా ముగిసింది. మరి ఆ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.
Also read : Kangana Ranaut : కంగనా రనౌత్ బికినీ ఫోటో షేర్ చేస్తూ మాజీ ఎంపీ ట్వీట్.. ఫైర్ అయిన హీరోయిన్..
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో తెలుగులో ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.
