Kangana Ranaut : కంగనా రనౌత్ బికినీ ఫోటో షేర్ చేస్తూ మాజీ ఎంపీ ట్వీట్.. ఫైర్ అయిన హీరోయిన్..

కంగనా రనౌత్ బికిని ఫోటోని రీ షేర్ చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వైరల్ ట్వీట్. ఇక దాని పై రియాక్ట్ అవుతూ కంగనా మండిపడింది.

Kangana Ranaut : కంగనా రనౌత్ బికినీ ఫోటో షేర్ చేస్తూ మాజీ ఎంపీ ట్వీట్.. ఫైర్ అయిన హీరోయిన్..

Kangana Ranaut counter tweet to EX MP Subramanian Swamy post

Updated On : October 27, 2023 / 3:13 PM IST

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా, రాజకీయపరంగా వైరల్ కామెంట్స్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటుంది. తాజాగా ఈ భామ ఒక మాజీ ఎంపీ పై ఫైర్ అయ్యింది. ఇటీవల దసరా మహోత్సవాలు సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగనా రనౌత్ చరిత్ర సృష్టించింది. ఆ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఒక నెటిజెన్ కంగనా రనౌత్ బికిని ఫోటోని ఒకటి షేర్ చేసింది.

ఆ ఫొటోలో కంగనాతో పాటు SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) గార్డ్స్ కూడా కనిపిస్తున్నారు. ఇక ఈ పిక్ ని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి రీ షేర్ చేస్తూ.. “SPG సంస్థ కంగనా కోసం చాలా ఎక్కువగానే పనిచేస్తుంది. రాంలీలా జరిగిన వేడుకకు చివరి రోజున ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలవడమే అందుకు నిదర్శనం. SPG అనేది ఒక గౌరవం లేని సంస్థ” అంటూ ట్వీట్ చేశారు. ఇక దీని పై రియాక్ట్ అవుతూ కంగనా మండిపడింది.

Also read : Yatra 2 : జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ సినిమాలో చంద్రబాబు పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా ?

కంగనా ట్వీట్.. “నా స్విమ్ సూట్ ఫోటో చూపిస్తూ మీరు చేసిన కామెంట్స్ మీ వక్రబుద్ధిని బయటపెడుతోంది. నేను హిందీ పరిశ్రమలో నేనొక రైటర్‌ని, డైరెక్టర్‌ని, నిర్మాతని, విప్లవ రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను. కానీ మీరు చెబుతుంది ఏంటంటే.. నేను రాజకీయాల్లోకి రావడానికి నా శరీరమే కారణమని. నా స్థానంలో యువకుడు అయిన లీడర్, మార్గదర్శి ఉన్నప్పుడు కూడా మీరు ఇలానే శరీరం గురించి మాట్లాడతారా..? అతడు కూడా శరీరం అమ్ముకున్నాడా అని అనగలరా..? మహిళలు అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. వారికీ గుండె, మెదడు, చేతులు, పాదాలు వంటి ఇతర పార్ట్స్ తో పాటు గొప్ప మనిషి అవ్వడానికి కావాల్సిన అన్ని విషయాలు కలిగి ఉంటారు” రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.