Rashmika Mandanna : ఒకప్పుడు యాక్టింగ్ రాదని ట్రోల్ చేసారు.. ఇవాళ స్టేట్ బెస్ట్ అవార్డు ఇచ్చారు.. రష్మిక కామెంట్స్ వైరల్..

సీఎం రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా రష్మిక ఈ అవార్డు అందుకుంది. (Rashmika Mandanna)

  • Published On : March 19, 2026 / 10:15 PM IST

Rashmika Mandanna

Rashmika Mandanna : తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం నేడు మార్చ్ 19న ఉగాది సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను ఇటీవల ఈ గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఈ ఈవెంట్ కి భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ అవార్డుల్లో రష్మికకు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది. దీంతో ఈ అవార్డు అందుకోడానికి రష్మిక తన అత్తయ్య, విజయ్ దేవరకొండ తల్లితో కలిసి ఈ వేడుకకు హాజరైంది. సీఎం రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా రష్మిక ఈ అవార్డు అందుకుంది.

Also See : Manchu Lakhsmi Daughter : మేనకోడలు పల్లకి మోసిన మంచు మనోజ్.. మంచు లక్ష్మి కూతురు ఓణీల వేడుక.. ఫొటోలు వైరల్..

బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న రష్మిక మాట్లాడుతూ.. ఇవాళ నేను ఒక మాట చెప్పాలి. ఒకప్పుడు నాకు యాక్టింగ్ రాదనీ ట్రోల్ చేసారు. కానీ ఇవాళ నాకు, నా పర్ఫార్మెన్స్ చూసి స్టేట్ అవార్డు ఇచ్చారు. చాలా దూరం వచ్చేసాను. గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాకు అవార్డు రావడం చాలా స్పెషల్. ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం ఇచ్చింది. ఇదంతా రాహుల్ వల్లే. చాలా ఏళ్ళకు ముందు ఇక్కడికి వస్తే కూతురులా నాకు ప్రేమ ఇచ్చారు. ఇప్పుడు మీ కోడలిగా మీ ముందు నిల్చున్నా. నా ఫ్యామిలీని బాగా చూసుకోండి అంటూ అవార్డు ఇచ్చిన కమిటీకి, సీఎం రేవంత్ కి, ఈవెంట్ కి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. దీంతో రష్మిక కామెంట్స్ వైరల్ గా మారాయి.