Rashmika Mandanna : డిసెంబర్ 6న రష్మికకు పెద్ద పరీక్షే..! ఆ రోజు ఏం జరగనుందంటే..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదు
- Thota Vamshi Kumar
- Published On : August 19, 2024 / 12:41 PM IST
Rashmika Mandanna two films release on Dec 6th
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదు. ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో నటిస్తూ యమా బిజీగా ఉంది. కాగా.. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఒకటి టాలీవుడ్ మూవీ ‘పుష్ప 2’ కాగా మరొకటి బాలీవుడ్ మూవీ ‘ఛావా’.
ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప-2’ మూవీ తెరకెక్కుతోంది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. బన్నీ, రష్మికలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే.. షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 6కు వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతోన్న ఛావా మూవీలోనూ రష్మిక నటిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతోండగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6 విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Prabhas : ప్రభాస్ పై బాలీవుడ్ నటుడి కామెంట్లు.. ఘాటుగా స్పందించిన టాలీవుడ్ నిర్మాత
ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం, భారీ బడ్జెట్ మూవీలు కావడం గమనార్హం. ఒకే రోజు రెండు సినిమాలు విడుదల కానుండడంతో ప్రస్తుతం రష్మిక పేరు మారుమోగిపోతుంది. మరి ఆ రోజు రష్మికకు ప్రత్యేకంగా మిగలనుందా లేదో తెలియాలంటే అప్పటి వరకు ఆగక తప్పదు.
