Rashmika Vijay
Rashmika Vijay : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న గత కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమ మీద ఎన్ని వార్తలు వచ్చినా స్పందించలేదు కానీ వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల ద్వారా హింట్స్ ఇచ్చారు. ఇటీవల ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఇద్దరూ కలిసి కనిపించి చాలా రోజులే అయింది. నిశ్చితార్థం తర్వాత ఈ ఇద్దరూ కలిసి కనిపించలేదు, కనీసం దీని గురించి మాట్లాడలేదు. వీరి నిశ్చితార్థం గురించి వీళ్ళే అధికారికంగా మాట్లాడితే చూడాలని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
నేడు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా వస్తున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా ఆల్రెడీ ఈ సమాచారం టాలీవుడ్ అంతా తెలిసింది. అయితే ఈ ఈవెంట్లో రష్మిక – విజయ్ వీరి నిశ్చితార్థం గురించి మాట్లాడతారని, వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెప్తారని ఫ్యాన్స్, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
Also Read : Shiva Jyothi : తల్లి కాబోతున్న శివజ్యోతి.. బిగ్ బాస్ భామ సీమంతం వేడుకలు..
ఈ ఇద్దరు కలిసి ఒకే ఫొటోలో కనపడి చాలా కాలం అయింది. ఈవెంట్లో కచ్చితంగా వీరిద్దరి ఫొటోలు వస్తాయి. దీంతో ఈ జంట ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఒక్క ఫోటో వచ్చినా చాలు సోషల్ మీడియా ట్రెండింగ్ అయిపోతుంది ఈ టాలీవుడ్ జంట. మరి నేడు జరగబోయే సక్సెస్ మీట్ లో రష్మిక – విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతారో చూడాలి.