Rashmika : షూటింగ్‌కి బ్రేక్ వస్తే రష్మిక ఎక్కడికి వెళ్తుందో తెలుసా..?
అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ.. రష్మిక, విజయ్ ల ప్రేమ విషయం, రష్మిక సినిమాల విషయాలు గురించి ప్రశ్నించారు. ఈక్రమంలోనే షూటింగ్‌కి బ్రేక్ వస్తే రష్మిక ఎక్కడికి వెళ్తుంది..
- gum 95921
- Published On : November 24, 2023 / 11:18 AM IST
Rashmika Mandanna where to go when their is no shooting in day
Rashmika : అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకు పోతున్నారు. ఈ భామ నటించిన తాజా చిత్రం ‘యానిమల్’ రిలీజ్ కి సిద్దమవుతుంది. సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ వంగా, రణబీర్, రష్మిక.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. ఈ ఎపిసోడ్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ.. రష్మిక, విజయ్ ల ప్రేమ విషయం, రష్మిక సినిమాల విషయాలు గురించి ప్రశ్నించారు.
ఈక్రమంలోనే ఈ ఎపిసోడ్ లో పాల్గొన్న రణబీర్ అండ్ సందీప్ వంగాని రష్మిక గురించి ఒక విషయం ప్రశ్నించారు. షూటింగ్ కి గ్యాప్ వస్తే రష్మికని ఎక్కడ కలుసుకోవచ్చు..? ఆమె షూటింగ్ లేని సమయంలో ఎక్కుడ ఎక్కడకి వెళ్తారో..? చెప్పని బాలకృష్ణ అడిగారు. ఈ ప్రశ్నకు రణబీర్ అండ్ సందీప్ ఇద్దరు కలిసి ఒకటే సమాధానం ఇచ్చారు. రష్మికకు షూటింగ్ లేకపోయినా, లేక కొంచెం సమయం దొరికినా ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతారని, ఆమెను కలుసుకోవాలంటే జిమ్ దగ్గరకు వెళ్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు.
Also read : Vijay – Rashmika : అన్‌స్టాపబుల్ షోలో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ కథకి క్లారిటీ వచ్చిందా..?
ఇక ఈ విషయం తెలుసుకున్న రష్మిక ఫ్యాన్స్.. నేషనల్ క్రష్ వెళ్లే జిమ్ ఏదో తెలుసుకొని అక్కడ పాగా వేయడం కోసం గూగుల్ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ ఎపిసోడ్ లోనే బాలకృష్ణ, విజయ్ దేవరకొండకి ఫోన్ చేయించారు. నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు అని బాలకృష్ణ విజయ్ ని ప్రశ్నించగా, విజయ్ బదులిస్తూ.. నేను దర్శకుడు సందీప్ ని లవ్ చేస్తున్నాను అంటూ చెప్పి మాటదాటేశాడు. దీంతో అన్‌స్టాపబుల్ షోలో కూడా రష్మిక, విజయ్ ప్రేమ రూమర్స్ చిక్కుముడి వీడలేదు. అయితే విజయ్ తో ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రష్మిక సిగ్గు పడడం, రణబీర్ కూడా వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు మాట్లాడడం ఫ్యాన్స్ ని ఇంకా సందేహ పడేలా చేస్తుంది.
