Raveena Tandon : పీరియడ్స్ లో రెయిన్ సాంగ్ షూటింగ్.. అప్పటి ఇబ్బందుల గురించి చెప్పిన హీరోయిన్

'టిప్ టిప్ బర్సా పానీ..' షూటింగ్ ఎంత కష్టంగా జరిగిందో తెలిపింది రవీనా టాండన్.

Raveena Tandon comments on tip tip barsa paani song shooting

Raveena Tandon : బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎన్నో హిందీ సినిమాలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది. అంతేకాదు వెబ్ సిరీస్ సైతం చేసింది. అయితే ఒకప్పుడు రవీనా టాండన్ మరియు అక్షయ్ కుమార్ జంటగా నటించిన మోహ్రా సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ‘టిప్ టిప్ బర్సా పానీ..’ అందరికీ తెలుసు. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ ఈ సాంగ్ ను వింటుంటారు ఆడియన్స్.

Also Read : Pushpa 2 : అప్పుడు సామీ.. ఇప్పుడు పీలింగ్స్.. సాంగ్స్ కోసం ఫోక్ సింగర్స్ ను తీసుకొచ్చిన సుకుమార్..

అయితే ఈ సాంగ్ షూటింగ్ ఎంత కష్టంగా జరిగిందో తెలిపింది రవీనా టాండన్. ఈ షూటింగ్ లో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.” ఈ పాట షూటింగ్ జరుగుతున్నసమయంలో రవీనా టాండన్ తన పీరియడ్స్ లో ఉన్నారట. కానీ వర్షం పాట కావడంతో ఆ వర్షం ఫీల్ ఉండాలని చల్లటి నీటిని తమపై పోశారట. ఆ చల్లటి నీటిలో మొత్తం తడిసిపోయిందట రవీనా టాండన్. ఇలాంటి పాటలు చెయ్యడానికి ఆమె చాలా అసౌకర్యంగా భావిస్తారట. కానీ ఈ సాంగ్ చెయ్యడంలో తప్పులేదని అనిపించి, తను పీరియడ్స్ లో ఉన్నప్పటికీ చేసిందట. అనంతరం ఈ సాంగ్ భారీ విజయాన్ని అందుకుంది.


కాగా సూర్యవంశీ సినిమాలో ఈ సాంగ్ మళ్ళీ రీమేక్ చేశారు.. ముందు రవీనా నే ఈ సాంగ్ కోసం తీసుకుందామనుకున్నారట. కానీ కత్రినాను తీసుకున్నారు. ఇందులో కత్రినా టిప్ టిప్ బర్సా పానీ సాంగ్ ను అద్భుతంగా చేసిందని తెలిపింది రవీనా. అంతేకాదు వారిద్దరూ ఆ సాంగ్ కి కొత్తదనాన్ని ఇచ్చారని, వారిద్దరూ చేసిన ఈ సాంగ్ ని తను బాగా ఎంజాయ్ చేసిందని తెలిపింది.