Ravi Teja : రవితేజ నిర్మాణంలో సుందరం మాస్టర్ సినిమా.. 1930 కాదు 2023..!

రవితేజ హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా తన నిర్మాణంలో టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష ప్రధాన పాత్రతో ఒక సినిమా సిద్ధం చేస్తున్నాడు.

Ravi Teja as Producer for Viva Harsha Sundaram Master movie

Ravi Teja – Sundaram Master : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన రవితేజ.. కొత్త టాలెంట్ ని అవకాశాన్ని కలిపంచేలా ‘ఆర్ టి టీం వర్క్స్’ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే నిర్మాతగా రెండు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన రవితేజ.. తాజాగా మరో మూవీని సిద్ధం చేస్తున్నాడు. టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (Viva Harsha) ప్రధాన పాత్రతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

SPY Trailer : నిఖిల్ స్పై ట్రైలర్ రిలీజ్.. లాస్ట్‌లో టాలీవుడ్ హల్క్ ఎంట్రీ..

ఈ చిత్రానికి ‘సుందరం మాస్టర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇంటరెస్టింగ్ ఉంది. పోస్టర్ బట్టి చూస్తే.. అడవిలో నివసించే ట్రైబల్స్ కి హర్ష చదువు నేర్పించనున్నాడని తెలుస్తుంది. అయితే చదువు ట్రైబల్స్ పిల్లలకు కాకుండా పెద్దలకు నేర్పించనున్నాడని పోస్టర్ లోని ట్యాగ్ లైన్ చూస్తుంటే తెలుస్తుంది. ‘బ్యాచ్ 1930 కాదు 2023’ అనే లైన్ ని పోస్టర్ పెట్టారు. ఏదేమైనా పోస్టర్ సినిమా పై ఆసక్తిని కలగజేస్తుంది.

Ravi Teja as Producer for Viva Harsha Sundaram Master movie

ఇక రవితేజ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao), ఈగల్ (Eagle) చిత్రాల్లో నటిస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు మూవీ స్టూవర్టుపురం గజదొంగ కథ ఆధారంగా తెరకెక్కుతుంటే, ఈగల్ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ రెండు చిత్రాల పై ఆడియన్స్ ఎం\లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ లో టైగర్ నాగేశ్వరరావు కానుంది. ఈగల్ మూవీ వచ్చే ఇది సంక్రాంతికి విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు.