Thulabharam : రవితేజ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్.. గ్లింప్స్ అదిరింది.. ఇది కూడా హిట్టే..
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం తులాభారం (Thulabharam ).
- Thota Vamshi Kumar
- Updated on- October 11, 2026 / 11:22 AM IST
Ravi Teja new movie with vivekathreya titled as Thulabharam
Thulabharam : ఇరుముడి చిత్రంతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు మాస్ మహారాజా రవితేజ. తాజాగా ఆయన కొత్త చిత్రం పట్టాలెక్కింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభమైంది. రవితేజ కెరీర్‌లో 78 చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది.
ఈ మూవీకి తులాభారం (Thulabharam) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అనశ్వరా రాజన్, ప్రియాంక మోనన్ కథానాయికలు. సీనియర్ నటుడు జెడి చక్రవర్తి విలన్‌గా కనిపించనున్నాడు. నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్, శ్రీని రావు నిర్మిస్తున్నారు.
Bigg Boss Telugu 10 : ఈ వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.. ? గొడవలు అరుపులు..
