‘కనకదుర్గ’ మాస్ మహారాజా కొత్త సినిమా షురూ

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 07:02 AM IST
‘కనకదుర్గ’ మాస్ మహారాజా కొత్త సినిమా షురూ

Updated On : March 15, 2019 / 7:02 AM IST

మాస్ మహారాజా రవితేజ.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా చేశాడు. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికి తాజాగా మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మైత్రి మేకర్స్ వారు. రభస డైరెక్టర్ సంతోష్ స్రీనివాస్ దర్శకత్వంలో తమిళ సినిమా తేరీ రిమేక్ గా ఈ సినిమా చేయబోతున్నారు. రవితేజతో వరుసగా రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది మైత్రి సంస్థ. స్క్రిప్ట్ మీద ఖర్చు, అడ్వాన్స్ లు కూడా ఇచ్చింది. ఆ కారణంగానే తమ బ్యానర్ కి ఫ్లాప్ ఇచ్చినప్పటికీ రవితేజతో మరో సినిమా చేయడానికి రిస్క్ తీసుకుంటుంది.
Read Also: ఓటర్ టీజర్: ఎలక్షన్‌ను క్యాష్ చేసుకుంటున్నారా?

ఈ కథను మొదట పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నప్పటికీ ఆయన రాజకీయల్లోకి జంప్ అవ్వడంతో రవితేజతో ప్రొసీడ్ అవుతున్నారు. అయితే కొన్ని సమస్యలు రావడంతో సినిమాకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమా పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాకి ‘కనకదుర్గ’ టైటిల్ ను ఫైనల్ చేయాలని చూస్తున్నారు.

గతంలో కృష్ణ అనే మాస్ సినిమా చేశాడు ఇప్పుడు కనకదుర్గ మంచి టైటిల్ అనే అనుకోవాలి. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ రవితేజతో జోడి కట్టనుంది. మరి ఈ ఇద్దరు కాంబినేషన్ లో అయినా మైత్రి మూవీ మేకర్స్ కి కాసుల వర్షం కురిపిస్తుందో లేదో చూడాలి. ఎక్కువ ఆలస్యం చేయకుండా విలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని దసరా లోపు తెరపైకి రావలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.  
Read Also: మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల