Raviteja : మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత రావణాసుర సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇప్పుడు దసరాకి(Dasara) టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాతో రాబోతున్నాడు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నారు. మొదటిసారి రవితేజ పాన్ ఇండియా సినిమా చేస్తుండటంతో అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ చేస్తున్నాడు.
టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్(Bollywood) లో కూడా అదరగొడుతున్నాడు రవితేజ. అక్కడ ప్రెస్ మీట్స్ పెడుతూ, అక్కడ టీవీ షోలలో పాల్గొంటున్నాడు. తాజాగా ఇండియా గాట్ ట్యాలెంట్ అనే ఓ హిందీ షోలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు టీంతో పాల్గొన్నాడు. ఈ షోలో బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో కలిసి స్టెప్పులు వేశాడు రవితేజ. టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని ఏక్ దమ్.. అనే సాంగ్ కి శిల్పాశెట్టి, రవితేజ డ్యాన్స్ వేశారు.
ఈ డ్యాన్స్ ని శిల్పా తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా రవితేజ దానిని రీ షేర్ చేసి.. మిమ్మల్ని కలవడం, మీతో డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశాడు. దీంతో రవితేజ, శిల్పాశెట్టి ల డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Absolutely loved meeting you @TheShilpaShetty🤗
and dancing with you for #EkDumEkDumHookStep
was Lol hahaha :))) https://t.co/IpjItitslN— Ravi Teja (@RaviTeja_offl) October 10, 2023