×
Ad

RT4GM : రవితేజ – గోపీచంద్ సినిమా ఆగిపోయిందా? కారణం ఏంటి? ఈ కాంబోలో ఇంకో హిట్ ఉంటుందా?

గోపీచంద్ మలినేని - రవితేజ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై రవితేజ అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఉంది.

  • Published On : November 23, 2023 / 11:16 AM IST

Raviteja Gopichand Malineni RT4GM Movie on Hold News Goes Viral

RT4GM Movie Update : రవితేజ(Raviteja) ప్రస్తుతం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. త్వరలో సంక్రాంతికి ‘ఈగల్’ సినిమాతో రాబోతున్నాడు మాస్ మహారాజ. ఆ తర్వాత గోపీచంద్ మలినేని(Gopichand Malineni), రవితేజ కాంబినేషన్లో సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

గోపీచంద్ మలినేని – రవితేజ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై రవితేజ అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సినా ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ అయితే వాయిదా వేశారు. ఇందుకు కారణం బడ్జెట్ అని తెలుస్తుంది.

‘ధమాకా’ తర్వాత వచ్చిన రవితేజ రెండు సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడం, ఈ సినిమాలో పాన్ ఇండియా యాక్టర్లు, వేరే పరిశ్రమల నుంచి స్టార్స్ ని గోపీచంద్ అడగడంతో అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడంతో పాటు, ఏ ఓటీటీ కూడా ఈ సినిమాని తీసుకోవడానికి ఇంకా ముందుకు రాలేదని అందుకే ప్రస్తుతం సినిమా షూటింగ్ ని వాయిదా వేశారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

ఏదైనా ఓటీటీ సినిమా డిజిటల్ రైట్స్ ముందే కొనుక్కుంటే నిర్మాతలు కొంచెం ధైర్యంగా భర్తీ బడ్జెట్ సినిమాలకు ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ థియేట్రికల్ లో లాస్ వచ్చినా నాన్ థియేట్రికల్ లో సేవ్ అవుతామని భావిస్తున్నారు. ఇప్పుడు రవితేజ సినిమాకు అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడం, ఇంకా ఏ ఓటీటీ సినిమా అరైట్స్ కోసం ముందుకు రాకపోవడం వల్లే రవితేజ – గోపీచంద్ సినిమా ఆగిందని వార్తలు వస్తున్నాయి.

Also Read : Dhootha : నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ చూశారా? రిలీజ్ ఎప్పుడంటే?

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో ధనుష్ బ్రదర్, తమిళ్ దర్శకుడు సెల్వరాఘవన్ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు, తమిళ నటి ఇందుజా రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టు చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించారు. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉండనుందని తెలుస్తుంది. అలాగే థమన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు.