Dhootha : నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ చూశారా? రిలీజ్ ఎప్పుడంటే?

నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కూడా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్(Vikram K Kumar) దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేశారు. మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది.

Dhootha : నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ చూశారా? రిలీజ్ ఎప్పుడంటే?

Naga Chaitanya First Web Series Dhootha Trailer Released

Updated On : November 23, 2023 / 10:28 AM IST

Dhootha Trailer : ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కూడా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్(Vikram K Kumar) దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేశారు. మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది. చైతూ మొదటిసారి ఈ జోనర్ లో చేస్తుండటంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా దూత సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సస్పెన్స్ గా ఉంది. ఇందులో నాగ చైతన్య ఒక జర్నలిస్ట్ గా కనపడబోతున్నట్టు, ఒక దినపత్రికని స్థాపించబోతున్నట్టు, అతనికి గతం తాలూకు ఏవో వెంటాడుతున్నట్టు, అనుకోకుండా అతని చుట్టూ హత్యలు, వాటిల్లో అతను ఇరుక్కుంటున్నట్టు చూపోయించారు. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా సాగబోతుందని తెలుస్తుంది.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూశారా? కుక్క గురించి ఆసక్తికర పోస్ట్..

ఇటీవలే దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దూత సిరీస్ లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో తెలియాల్సి ఉంది. నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా ఓ సినిమా చేస్తున్నారు.