Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూశారా? కుక్క గురించి ఆసక్తికర పోస్ట్..

ట్విట్టర్ లో రెగ్యులర్ గా రాజకీయాల గురించి పోస్టులు పెట్టే పవన్ ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం చాలా రేర్ గా ఆసక్తికర పోస్టులు మాత్రమే పెడుతున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూశారా? కుక్క గురించి ఆసక్తికర పోస్ట్..

Updated On : November 23, 2023 / 9:56 AM IST

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan)కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప‌వ‌న్ ఇటు సినిమాలతోను అటు రాజ‌కీయాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు. ట్విట్ట‌ర్‌లో రాజకీయాలకు సంబంధించి యాక్టివ్‌గా ఉండే పవన్ ఇటీవ‌ల కొన్నాళ్ళ క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. పవన్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ట్విట్టర్ లో రెగ్యులర్ గా రాజకీయాల గురించి పోస్టులు పెట్టే పవన్ ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం చాలా రేర్ గా ఆసక్తికర పోస్టులు మాత్రమే పెడుతున్నారు. రెండు వారాల క్రితం మోడీ సభ గురించి పోస్ట్ పెట్టిన పవన్ తాజాగా ఓ కుక్క గురించి పోస్ట్ చేశారు.

Also Read : Game Changer Update : ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. షూటింగ్ మొదలు.. ఎక్కడో తెలుసా?

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఓ పోలీస్ కుక్కతో పవన్ సరదాగా ఉన్న వీడియోని షేర్ చేస్తూ.. నేను బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నా ఫ్లైట్ ఎక్కేందుకు ఎదురుచూస్తుండగా నా కోసం ఓ సర్‌ప్రైజ్ విజిటర్ వచ్చాడు. అతను ఎవరో కాదు పోలీస్ డాగ్ స్క్వాడ్ లో ఉండే బిందు(కుక్క). అది నాతో చాలా స్నేహంగా ఉంది. తన తోకని ఆసక్తిగా ఊపింది. తను నాలో ఉత్సాహం నింపింది. నేను విమానం ఎక్కేముందు ఓ అనుకోని అందమైన అనుభూతిని ఇచ్చింది అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కుక్కతో సరదాగా ఆడుతున్న వీడియో వైరల్ అవగా అభిమానులు, నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)