Irumudi Collections : అదరగొట్టిన రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్.. ఇప్పటికే ఎన్ని కోట్లు ప్రాఫిట్స్ తెలుసా?

దీంతో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. (Irumudi Collections)

  • Published on- August 24, 2026 / 11:14 AM IST

Irumudi Collections

Irumudi Collections : రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణం దర్శకత్వంలో తెరెక్కిన సినిమా ఇటీవల ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను మెప్పించింది. అయ్యప్ప స్వామి మాల బ్యాక్ డ్రాప్ తో, తండ్రి కూతుళ్ళ అనుబంధంతో, అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి అనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా హిట్ అయింది.

ఇరుముడి సినిమా చూసి అయ్యప్ప స్వామి పాటలకు వైబ్ అవ్వడమే కాక క్లైమాక్స్ ఎమోషన్ కి ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వస్తున్నారు. దీంతో ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది. మౌత్ టాక్ బాగా వెళ్లడంతో టికెట్స్ కూడా దొరక్కుండా మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్స్ అయ్యాయి. దీంతో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి.

Also Read : Nainisha : ప్రదీప్ టాటూ వేయించుకొని.. స్టేజిపై ఇష్టం అని చెప్పి.. ఏడ్చేసిన సీరియల్ నటి..

ఇరుముడి సినిమా మూడు రోజుల్లో ఏకంగా 80 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు 20 కోట్లకు పైగా థియేటరికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే కనీసం 45 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే హిట్ అయినట్టే. ఇప్పటికే మూడు రోజుల్లోనే 80 కోట్లు కలెక్ట్ చేసి అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపొయింది. దీంతో ఈ సినిమాకు ఇప్పటికే 35 కోట్ల ప్రాఫిట్స్ వచ్చాయి.

ఇవాళ కూడా బుకింగ్స్ బాగా అవుతున్నాయి. ఈజీగా మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా అమెరికాలో కూడా 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. రవితేజ కెరీర్ లోనే ఫాస్ట్ గా బ్రేక్ ఈవెన్ అయిన సినిమాగా, ఫాస్ట్ గా 1 మిలియన్ సాధించిన సినిమాగా నిలిచింది ఇరుముడి. ఈ సినిమాతో మరోసారి 100 కోట్లు వస్తే ధమాకా తర్వాత రెండో వంద కోట్ల సినిమాగా రవితేజ కెరీర్లో నిలవనుంది ఇరుముడి.

Also See : Priyanka Chopra : భర్తతో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా..