Raviteja lineup having four movies including Krack 2
Raviteja Movies : సినిమా హిట్టవ్వడం, ఫ్లాపవ్వడంపై రవితేజ ఎప్పుడూ దృష్టి పెట్టడు. 55 ఏళ్ళు వచ్చినా ఈ టైమ్ లో కూడా వరుసగా సినిమాలు చేయడం ఆయనకు మాత్రమే చెల్లింది. గతేడాది ధమాకాతో 100 కోట్ల సినిమా అందుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ తో కలిసి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత రావణాసురగా పర్వాలేదనిపించుకున్నాడు. అక్టోబర్ లో టైగర్ నాగేశ్వరరావు గా రాబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈగల్ గా థియేటర్స్ లోకి దిగబోతున్నాడు.
ఇలా గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ. ఇంకో రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు ఇంకో రెండు సినిమాలు ఓకే చేసుకున్నారు. ప్రజెంట్ రవితేజ మరో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చినట్లు టాక్. అందులో ఒకటి వాసు అనే డెబ్యూ డైరెక్టర్‌తో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నాడు. సితార బ్యానర్ లో రవితేజ చేయబోయే ఫస్ట్ మూవీ ఇదే.
Yash : యశ్ నెక్స్ట్ సినిమా ఆమె దర్శకత్వంలో? ఈసారి లవ్ స్టోరీతో..
ఇక రవితేజ చేతిలో ఉన్న రెండో సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కబోతున్నట్టు టాక్. డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మాస్ రాజా మళ్లీ జట్టు కట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో క్రాక్ 2 సినిమా అంటుందని డైరెక్టర్ గోపీచంద్ గతంలోనే చెప్పాడు. అయితే ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోబోతోంది. ఇందులో శ్రీలీలను హీరోయిన్ గా ఖాయం చేయబోతున్నట్టు టాక్. ఇంతకు ముందు రవితేజ, శ్రీలీల కలిసి సందడి చేసిన ధమాకా వసూళ్ళ పరంగా అదరగొట్టేసింది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ రచ్చ చేయబోతుండడం, ఇది క్రాక్ కి సీక్వెల్ అవ్వడంతో సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.