Raviteja : ఇరుముడి సక్సెస్‌ ముగిసింది.. రవితేజ నెక్స్ట్ సినిమా ఏంటి..?

ఇరుముడి సక్సెస్‌ తర్వాత చేసే సినిమాల విషయంలో చాలా ఆచితూచిగా అడుగులు వేస్తున్నారు రవితేజ. (Raviteja)

  • Published on- October 4, 2026 / 05:35 PM IST

Raviteja

Raviteja : ఇరుముడి సక్సెస్‌.. రవితేజ వరుస ఫెయిల్యూర్స్‌కి చెక్‌ పెట్టింది. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ డివోషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌తో హిట్టు పల్లకి ఎక్కినాడు మాస్‌ మహారాజ. శివ నిర్మాణ తెరకెక్కించిన ఇరుముడి అంచనాలకి మించి అంతకుమించి అనేలా బాక్సాఫీస్‌ దగ్గర ఫర్మార్మ్‌ చేసింది. 250 కోట్లకి పైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన రవితేజకి అదిరిపోయే బ్లాక్‌బాస్టర్‌ సక్సెస్‌ ఇచ్చింది. అంతేకాదు ఇరుముడి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యాయి అంటే ఏ రేంజ్‌లో ఇంపాక్ట్‌ చూపించిందో ఇరుముడి తెలుస్తుంది.

ఇరుముడి సక్సెస్‌ తర్వాత చేసే సినిమాల విషయంలో చాలా ఆచితూచిగా అడుగులు వేస్తున్నారు రవితేజ. ఇరుముడి సినిమా సక్సెస్‌ తర్వాత రవితేజ మార్కెట్‌ స్టామినాపై మరోసారి అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. మాస్‌ మహారాజకి ఎమోషన్‌ వర్కౌట్‌ అయితే బాక్సాఫీస్ సెన్సేషన్ ఏ లెవెల్‌లో ఉంటుందో ప్రూవ్‌ చేసింది ఇరుముడి. అందుకే ఈ సారి కెరీర్‌లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ని మాస్‌ మహారాజ సెలెక్ట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Also Read : Vishika : ‘ది ప్యారడైజ్’ సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నటి ‘విషిక’..

యంగ్ డైరెక్టర్‌ వివేక్ ఆత్రేయ తెరకెక్కించే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు కూడా ఫైనల్‌ స్టేజ్‌కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇరుముడి సక్సెస్‌ తర్వాత దిల్‌ రాజు బ్యానర్‌లో రవితేజ సినిమా చేయాలి. రాజ రాజ చోర ఫేమ్‌ యంగ్‌ డైరెక్టర్‌ హసిత్‌ గోలీ దర్శకత్వంలో ఫాస్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించి 2027 సంక్రాంతి రిలీజ్‌ టార్గెట్‌గా ప్రకటించారు మేకర్స్. కానీ సంక్రాంతికి పోటీ ఎక్కువవడం, టైం తక్కువ ఉండటంతో హసిత్‌ గోలీ ప్రాజెక్ట్‌ హోల్డ్‌లో పడింది.

దీంతో వివేక్‌ ఆత్రేయ సినిమా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హారర్‌ కామెడీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమా దసరాకి లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇరుముడి టైటిల్‌లానే పాజిటివ్‌ వైబ్స్‌ వచ్చేలా తులాభారం పేరుని ఈ సినిమాకి పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి ఇరుముడి ఇచ్చిన సక్సెస్‌ని రవితేజ ఫ్యూచర్‌ సినిమాలతో ఎంతవరకు కంటిన్యూ చేస్తారో చూడాలి.

Also Read : Bandla Ganesh : ఒక్క సినిమా ఇవ్వు బాబు… బ్లాక్‌బస్టర్ తీస్తా.. ఆ హీరోని రిక్వెస్ట్ చేసిన బండ్లన్న.. ఛాన్స్ ఇస్తాడా మరి?