Tiger Nageswara Rao : వేట మొదలు పెట్టేస్తున్న రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు అప్డేట్!

నిన్న రావణాసుర (Ravanasura) ట్రైలర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన రవితేజ (Raviteja).. తాజాగా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.

Tiger Nageswara Rao : మాస్ రాజా రవితేజ (Raviteja) వరుస అప్డేట్ లు ఇస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇటీవలే ధమాకా (Dhamaka) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం రవితేజ రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. రావణాసుర (Ravanasura), టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మాస్ కమర్షియల్ సినిమాలను తీసుకు వస్తున్నాడు.

Ravanasura Trailer : ఈ భూమి మీద నన్ను ఆపగలిగేది ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే.. రావణాసుర ట్రైలర్ రిలీజ్..

ఇక నిన్న (మార్చి 28) రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వగా, తాజాగా టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా 1970 కాలంలో స్టూవర్ట్‌పురం గజ దొంగగా పేరు గాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు.

Raviteja: మరో మల్టీస్టారర్ మూవీకి రవితేజ గ్రీన్ సిగ్నల్..? ఈసారి ఎవరితో అంటే..?

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, తేజ్ నారాయణ్ అగర్వాల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీస్ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మరి ఈ సినిమాతో కూడా అదే సక్సెస్ ని అందుకుంటారా? లేదా? చూడాలి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్‌ (Renu Desai) చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు