Tiger Nageswara Rao : ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసిన టైగర్ నాగేశ్వరరావు..

టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసిన రవితేజ. ఎప్పుడు విడుదల చేస్తున్నారంటే..

Raviteja Tiger Nageswara Rao Trailer release date update

Tiger Nageswara Rao : నూత‌న ద‌ర్శ‌కుడు వంశీ డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) నటిస్తున్న యాక్షన్ మూవీ ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. టీజర్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. తాజాగా ఇప్పుడు ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.

Saindhav : ప్రభాస్ రాకతో సంక్రాంతి వెళ్లే ఆలోచనలో వెంకటేష్.. సైంధవ్ పోస్ట్‌పోన్..!

ఈ మూవీ ట్రైలర్ ని అక్టోబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు నేడు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన రవితేజ కొత్త పోస్టర్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీలో రవితేజ సరసన బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్ర‌కాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Nithya Menen : తమిళ్ యాక్టర్ నన్ను వేధించాడు.. వైరల్ అవుతున్న నిత్యా మీనన్ కామెంట్స్.. నిజమెంత..?

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ చుట్టూ ఒక వివాదం నడుస్తుంది. ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో స్టూవర్టుపురంకి చెందిన ప్రజలను, ఎరుకల జాతిని కించపరిచే విధంగా సినిమా తీస్తున్నారంటూ స్టువర్టుపురం ప్రజలు కోర్టుని ఆశ్రయించారు. అంతేకాదు ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు కూడా దిగారు. అయితే ఈ వివాదం పై మూవీ టీం మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.