Samantha: ఎక్కడా తగ్గని సమంత.. సినీ కెరీర్‌కు బ్రేక్ వెనుక కారణమదేనా

టాలీవుడ్‌లో పెళ్లి అయితే క్రేజ్ తగ్గిపోతుందని భావించే ట్రెండ్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి దూసుకెళ్లిపోతున్నారు సమంత. ఏ మాయ చేశావే సినిమాతో వచ్చిన క్రేజ్ ను అలా అలా పెంచుకుంటూ..

Samantha

Samantha: టాలీవుడ్‌లో పెళ్లి అయితే క్రేజ్ తగ్గిపోతుందని భావించే ట్రెండ్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి దూసుకెళ్లిపోతున్నారు సమంత. ఏ మాయ చేశావే సినిమాతో వచ్చిన క్రేజ్ ను అలా అలా పెంచుకుంటూ పోతూ తెలుగు, త‌మిళ భాష‌ల‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ఒకే కాలంలో చేస్తూ.. ఇంకో వైపు సోష‌ల్ మీడియాతో సంద‌డి చేస్తున్నారు.

నెట్టింట్ ఫుల్ యాక్టివ్ గా ఉండే శామ్.. సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ.. భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.

అందమే కాకుండా అభినయంతో మెప్పిస్తున్నారు కాబట్టే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో పదేళ్లుగా టాప్ లో కొనసాగుతున్నారు స‌మంత. పెళ్లి త‌ర్వాత ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తున్న స‌మంత ఇటీవ‌ల ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నెగిటివ్ పాత్ర పోషించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు.

శాకుంత‌లం చిత్రం ద్వారా తొలిసారి కెరీర్‌లో చారిత్రాత్మ‌క చిత్రం చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ షూటింగ్ పూర్తి చేసిన సామ్ ప్ర‌స్తుతం కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలో న‌టిస్తుంది. ఈ రెండు సినిమాల‌ తర్వాత బ్రేక్ తీసుకోనుంద‌ని స‌మాచారం. దాదాపు ద‌శాబ్ధ కాలంగా సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న స‌మంత కొద్ది రోజులు విలువైన స‌మ‌యాన్ని కుటుంబానికి కేటాయించాల‌ని అనుకుంటుంద‌ట‌.

ఇదిలా ఉంటే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని.. ఏదో విషయం ఉండే ఉంటుందనే పుకార్లు వినిపిస్తున్నాయి మరి.