Renu Desai: నేనొక అంధ భక్తురాలిని.. ధురంధర్ 2 మూవీపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్
ధురంధర్, ధురంధర్ 2 సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి రేణు దేశాయ్(Renu Desai).
- V Santhosh Kumar
- Published On : March 23, 2026 / 09:57 AM IST
Renu Desai interesting comments on Dhurandhar and dhurandhar 2 movies
Renu Desai: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ (ధురంధర్: ది రివెంజ్) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ సినిమా జోరు చూస్తుంటే రూ. 2000 కోట్ల మార్కును సునాయాసంగా దాటేలా కనిపిస్తోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Niharika Konidela: రెండో పెళ్లిపై స్పందించిన నిహారిక.. ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన మెగా డాటర్
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి వంటి వారు ఇప్పటికే ఈ సినిమా చూసి చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ క్రమంలోనే తాజాగా నటి రేణూ దేశాయ్(Renu Desai) ఈ సినిమాపై చేసిన సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్ర చెప్పే ఒక కీలకమైన డైలాగ్ రీల్‌ను షేర్ చేస్తూ, ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను బీజేపీకి, మన ప్రధాని మోదీజీకి గర్వించదగిన అంధ భక్తురాలిని” అని పేర్కొంటూ తన దేశభక్తిని చాటుకున్నారు.
దేశ సరిహద్దుల్లో సాయుధ దళాలు, నిఘా సంస్థలు ప్రాణాలకు తెగించి పోరాడటం వల్లే మనమందరం ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నామని ఆమె గుర్తు చేశారు. సొంత దేశం గురించి అవగాహన లేకుండా మాట్లాడే వారు తప్పకుండా ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలను చూడాలని ఆమె సూచించారు. యుద్ధభూమి పిలుస్తున్నప్పుడు ధైర్యంగా అడుగు వేయాలని, ప్రతిఫలాన్ని ఆశించకుండా ధర్మాన్ని పాటించడమే మన కర్తవ్యమని రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ‘చాయ్‌వాలా జల్వా’ అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
