Renu Desai Interesting Comments on Sanathana Dharmam
Renu Desai : నటి రేణు దేశాయ్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల గురించి, తన టూర్స్, తన ఎన్జీఓ గురించి పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ సనాతన ధర్మం గురించి మాట్లాడింది.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. సూడో సెక్యులర్స్ వల్లే అసలు సమస్య. వేరే వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు లేదు. కానీ వాళ్ళ కోసం మనల్ని తక్కువ చేయడం తప్పు. నా ఫ్రెండ్స్ లో కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. మేము ఎప్పట్నుంచో కలిసే ఉన్నాం. అందరి రిలీజియన్స్ ని గౌరవిస్తాను. నేను సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాను. నేను హిందూని. ఒక మనిషి మంచిగా బతకాలి అని చెప్పేది సనాతన ధర్మం.
Also See : కళ్యాణ్ రామ్ – విజయశాంతి.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి నుంచి తల్లి కొడుకుల ఎమోషనల్ సాంగ్ విన్నారా?
ఇవాళ పేరెంట్స్ కే చిన్న చిన్న మంత్రాలు కూడా తెలియదు. ఇంక వాళ్ళు పిల్లలకు చెప్పట్లేదు. కనీసం గాయత్రీ మంత్రం, హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా, గణపతి మంత్రం, శివాష్టకం.. ఇలాంటివి కూడా ఏం రావు. నేను మా పిల్లలకు నేర్పాను. ముందు వాళ్లకు కష్టంగా ఉండేది, ఎందుకు అని అడుగుతారు. కానీ మనం చెప్పి నేర్పించాలి. ఇప్పటి పేరెంట్స్ చిన్న చిన్నవి కూడా పిల్లలకు చెప్పట్లేదు. నేను రోజు రాత్రి 7కి కచ్చితంగా ఇంట్లో దీపం పెడతాను. కొన్ని మంత్రాలు చదువుతాను అని గణపతి మంత్రం, శివుడి మంత్రం కూడా చెప్పింది ఇంటర్వ్యూలోనే. దీంతో సనాతన ధర్మం గురించి పిల్లలకు చెప్పి నేర్పిస్తున్నందుకు రేణు దేశాయ్ ని అభినందిస్తున్నారు.
Also Read : Renu Desai – Akira Nandan : అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ ఆపండి.. అకిరాని కొంతమంది తిడుతున్నారు..