Renu Desai: హేమలతా లవణం పాత్రలో రేణు దేశాయ్ రీఎంట్రీ అదిరిందిగా!
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించి మెప్పించిన రేణు దేశాయ్, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుని, సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను మళ్లీ మొదలుపెట్టేందుకు రెడీ అయ్యింది రేణు దేశాయ్. ఆమె తాజాగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాలో రీఎంట్రీ ఇస్తోంది.
- Anil Aaleti
- Published On : September 29, 2022 / 09:40 PM IST
Renu Desai Re-Entry As Hemalatha Lavanam In Tiger Nageswara Rao Movie
Renu Desai: టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించి మెప్పించిన రేణు దేశాయ్, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుని, సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను మళ్లీ మొదలుపెట్టేందుకు రెడీ అయ్యింది రేణు దేశాయ్. ఆమె తాజాగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాలో రీఎంట్రీ ఇస్తోంది.
Renu Desai : జీవితంలో ఒక తోడు కావాలి.. రేణు దేశాయ్ స్పెషల్ పోస్ట్.. రెండో పెళ్లి..?
ఇక ఆమె ఈ సినిమాలో నటిస్తోందని తెలిసినప్పటి నుండి ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా.. ఆమె ఈ సినిమాలో ఎలా కనిపిస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, తాజాగా రేణు దేశాయ్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందనే విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ప్రముఖ సామాజిక వేత్త ‘హేమలతా లవణం’ పాత్రలో రేణు దేశాయ్ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.
Renu Desai: రేణు దేశాయ్ ఫ్రీ ప్రమోషన్.. ఎందుకో తెలుసా?
ఆమె పాత్ర కోసం రేణు దేశాయ్ చాలా మేకోవర్ అయ్యిందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో రవితేజ పాత్ర కూడా చాలా రియలిస్టిక్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
