Renu Desai: రేణు దేశాయ్ ఫ్రీ ప్రమోషన్.. ఎందుకో తెలుసా?

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఒకరు. ఇటు ఆమె ప్రొఫెషనల్ విషయాలతో పాటు..

Renu Desai: రేణు దేశాయ్ ఫ్రీ ప్రమోషన్.. ఎందుకో తెలుసా?

Renu Desai

Renu Desai: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఒకరు. ఇటు ఆమె ప్రొఫెషనల్ విషయాలతో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్న రేణు తాజాగా ఓ ప్రీ ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినాయకచవితి అంటే అందరికీ ఇళ్లలో పూజలతో పాటు వాడవాడనా భారీ విగ్రహాలతో ఉత్సవాలు గుర్తొస్తాయి. అయితే.. ఈ భారీ విగ్రహాలతో వాడే కెమికల్స్ వలన పర్యావరణం ఘోరంగా దెబ్బతింటుంది.

అందుకే ఈ మధ్య కాలంలో అందుకు ప్రత్యామ్నాయంగా మట్టి వినాయకుడు, సీడ్ గణేష్, పర్యావరణ హిత పదార్ధాలతో చేసిన విగ్రహాల ప్రాధాన్యత తెలుపుతూ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలను ఎడ్యుకేట్ చేసే పనిలో ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు రేణు దేశాయ్ కూడా ఇలాంటి ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా రేణూ దేశాయ్ సీడ్ గణేశుడిని వాడండి అంటూ చెప్పుకోస్తూ.. దీని కోసం ఓ సంస్థ వేసిన యాడ్‌ను రేణూ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాధారణంగా ఇప్పుడు సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాను బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు వాడుతున్న సంగతి తెలిసిందే.

రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ యాడ్ కూడా అలానే పైడ్ ప్రమోషన్ గా భావిస్తారని అనుకుంటారని ఇది పైడ్ ప్రమోషన్ కాదు ఫ్రీ ప్రమోషన్ మాత్రమేనని ముందే చెప్పేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ద్వారా తయారు చేసిన విగ్రహాలను వాడకండని.. సీడ్ గణేషునితో పండగ జరుపుకోవాలని రేణూ దేశాయ్ సలహా ఇచ్చారు. ఇందుకు తాను ఏ మాత్రం డబ్బు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.