Renu Desai : 20 ఏళ్ళ తర్వాత తమిళ్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్.. ఏకంగా ధనుష్ సినిమాతో..
రేణు దేశాయ్ ఇప్పుడు తమిళ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. (Renu Desai)
- Saketh U
- Published on- November 10, 2026 / 08:17 PM IST
Renu Desai
Renu Desai : ఒకప్పుడు బద్రి సినిమాతో ఉర్రూతలూగించిన రేణు దేశాయ్ 25 ఏళ్ళ క్రితమే నటించడం మానేసింది. కానీ గత మూడు నాలుగేళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాలు, టీవీ షోలలో కనిపిస్తుంది. 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఇప్పుడు తమిళ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
తమిళ్ లో చివరగా రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో జేమ్స్ పాండు అనే సినిమా చేసింది. ఇపుడు 26 ఏళ్ళ తర్వాత ధనుష్ ఓం సినిమాతో రేణు దేశాయ్ తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. ధనుష్ హీరోగా సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి కీలక పాత్రల్లో రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓం సినిమా తెరకెక్కుతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్, ఆంద్ర – తమిళనాడు పోలీస్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఓం సినిమా నవంబర్ 20న తెలుగు, తమిళ్ లో రిలీజ్ కాబోతుంది .
ఓం సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించిందని తమిళ మీడియా సమాచారం. తాజాగా రేణు దేశాయ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఓం పోస్టర్ షేర్ చేసి నవంబర్ 20న థియేటర్స్ లో కలుద్దాం అని పోస్ట్ చేసింది. దీంతో రేణు దేశాయ్ తమిళ్ లో గ్రాండ్ గానే ఎంట్రీ ఇస్తుంది, మరి ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
