Renu Desai : యానిమల్ సినిమాపై రేణు దేశాయ్ రివ్యూ.. ఏమన్నారో తెలుసా?

పలువురు సినీ సెలబ్రిటీలు కూడా యానిమల్ సినిమాపై పొగిడేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ యానిమల్ సినిమా చూసి తన రివ్యూని సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Updated on- December 6, 2023 / 04:45 PM IST

Renu Desai Review on Sandeep Reddy Ranbir Kapoor Animal Movie

Renu Desai : సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక(Rashmika) జంటగా తెరకెక్కిన సినిమా యానిమల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా యానిమల్(Animal) సినిమా పేరే వినిపిస్తుంది. ఆ రేంజ్ లో పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఓ పక్క ఫాదర్ ఎమోషన్ తో ఏడిపిస్తూనే మరో పక్క బోల్డ్ సీన్స్ తో, మాస్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టాడు సందీప్ వంగ. ఇప్పటికే ఈ సినిమా అయిదు రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా.

యానిమల్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కి మంచి పేరు వస్తోంది. యానిమల్ సినిమాపై అన్ని చోట్ల, అన్ని భాషల్లో మంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా యానిమల్ సినిమాను పొగిడేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ యానిమల్ సినిమా చూసి తన రివ్యూని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read :  ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిస్తున్న హీరో.. బాస్కెట్ బాల్ లో దూసుకుపోతున్న అరవింద్ కృష్ణ..

”ఎలాగైతేనేం మొత్తానికి నిన్ననే యానిమల్ సినిమా చూశాను. నిస్సందేహంగా ఈ సినిమాతో ప్రేమలో పడ్డాను. ఈ సినిమా బలహీనమైన గుండె ఉన్నవాళ్ళ కోసం మాత్రం కాదు. దీంట్లో చాలా బ్లడీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడటం మిస్ అవ్వకండి” అని రష్మిక ఫోటో పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. రేణు దేశాయ్ యానిమల్ సినిమా గురించి పొగుడుతూ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.