Pawan Kalyan Daughter Aadya, Narendra Modi
తమ కూతురు ఆద్య గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆద్య తన తండ్రి పవన్ కల్యాణ్, అకీరాతో కలిసి ఢిల్లీకి వెళ్లలేకపోయిందని చెప్పింది.
ఆ రోజున ఆద్య పాఠశాల పున:ప్రారంభం కావడంతో ప్రధాని మోదీని కలవాలనే ఆమె కోరిక అప్పట్లో తీరలేదని, చివరకు నిన్న అకీరా తన తండ్రి పవన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమెను మోదీకి పరిచయం చేశాడని తెలిపింది. తన టీనేజ్ నుంచి తాను బీజేపీని ఎంతగానో అభిమానించే వ్యక్తినని రేణూ దేశాయ్ చెప్పింది.
కనీసం తన పిల్లలయినా వారి తండ్రివల్ల ప్రధాని మోదీని కలిశారని, అందుకే ఒక తల్లిగా తాను చాలా సంతోషిస్తున్నాని తెలిపింది. కాగా, పవన్ కల్యాణ్ తో పాటు ఇటీవల అకీరా ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆద్య కనపడలేదు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అకీర, ఆద్య ఇద్దరూ వచ్చారు.
Also Read: ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కీలక వ్యాఖ్యలు