Renu Desai-Akira Injury: రోడ్లన్నీ తవ్వేస్తారు.. అకిరాకు చెయ్యి విరిగింది.. ఫైర్ అయిన రేణు దేశాయ్..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడింది.(Renu Desai)

  • Updated on- May 19, 2026 / 10:41 AM IST

Renu Desai Tells About Akira Nandan Injury Sensational Comments on Governance

Renu Desai : పవన్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఇటీవల పలు సామాజిక సమస్యలపై, కుక్కలకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తుంది. ఈ క్రమంలో రెగ్యులర్ గా మీడియా ముందుకు రావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడింది.

ఈ క్రమంలో మన గవర్నమెంట్స్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల, రోడ్లు బాగోకపోవడం వల్ల అకీరాకు దెబ్బలు తగిలి గాయాలు అయ్యాయి అని గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

Also Read : CM Vijay : సీఎం విజయ్‌కి కారు నెంబర్ ప్లేట్ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్.. అప్పుడు అనుకున్నారు ఇప్పుడు అయింది..

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. అకీరాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఆదివారం పూట ఉదయం తన ఫ్రెండ్స్ తో సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే రోడ్డు బాగోకపోవడం వల్ల కింద పడ్డాడు. అక్కడ రోడ్డంతా తవ్వేసి ఉంది. అకీరాకు దెబ్బలు తగిలాయి, చేయి విరిగింది. ఫేస్ మొత్తం గీరుకుపోయింది. ఇప్పటికి గడ్డం వద్ద ఆ దెబ్బ తాలూకు గీత ఉంటుంది.

అది ఎవరివల్ల జరిగింది. అక్కడ రోడ్లు తవ్వేసి ఉన్నాయి. మన గవర్నెన్స్ బాగోదు రోడ్ల విషయంలో. ఎప్పుడూ ఇష్టమొచ్చినట్టు తవ్వుతునే ఉంటారు. రోడ్లు సరిగ్గా వేయరు. మన దేశంలో సరిగ్గా రోడ్లు ఉండవు. ఎంతమంది రోడ్లు బాగోలేకపోవడం వల్ల దెబ్బలు తగిలించుకున్నారు, ఎంతమందికి గాయాలు అయ్యాయో తెలుసా అంటూ ఫైర్ అయింది.

Also Read : NTR : విజయ్ సీఎం అవ్వడం పెద్ద విశేషం కాదు.. ఎన్టీఆర్ సీఎం అవుతారు.. దువ్వాడ జంట కామెంట్స్ వైరల్..

పవన్ కూడా ఏపీలో అధికారం రాకముందు ఎక్కువగా రోడ్ల సమస్యలు, రోడ్లపై ఉన్న గుంతలు, బాగోని రోడ్ల గురించి పోరాటం చేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చాలా వరకు రోడ్లు వేయిస్తున్న సంఘటనలు, అసలు రోడ్లే లేని మారుమూల గ్రామాలకు రోడ్లు వేయిస్తున్న సంగతి తెలిసిందే.