RGV – Demonte Colony 2 : మళ్ళీ చాన్నాళ్లకు హారర్ సినిమాని ప్రమోట్ చేస్తున్న ఆర్జీవీ.. ‘డీమాంటీ కాలనీ 2’ చూసి భయపడండి..

డీమాంటీ కాలనీ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కు డైరెక్టర్ ఆర్జీవీ, అజయ్ భూపతి గెస్టులుగా వచ్చారు. చాన్నాళ్ల తర్వాత ఆర్జీవీ ఒక హారర్ సినిమాని ప్రమోట్ చేయడానికి రావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి

RGV in Demonte Colony 2 Pre Release Event for Promoting Best Horror Movie

RGV – Demonte Colony 2 : తమిళ్ లో ఇటీవల రిలీజయి సూపర్ హిట్ అయిన హారర్ థ్రిల్లర్ సినిమా డీమాంటీ కాలనీ 2 ఇప్పుడు తెలుగులో రాబోతుంది. డీమాంటీ కాలనీ 2 సినిమా ఆగస్టు 23న తెలుగులో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్.. పలువురు ముఖ్య పాత్రల్లో అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాని శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో బి.సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Vishwambhara : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. ‘విశ్వంభర’ కొత్త పోస్టర్ రిలీజ్.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే..?

ఇప్పటికే డీమాంటీ కాలనీ 2 ట్రైలర్ హారర్ తో భయపెట్టింది. తాజాగా హైదరాబాద్ లో డీమాంటీ కాలనీ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కు డైరెక్టర్ ఆర్జీవీ, అజయ్ భూపతి.. పలువురు గెస్టులుగా వచ్చారు. చాన్నాళ్ల తర్వాత ఆర్జీవీ ఒక హారర్ సినిమాని ప్రమోట్ చేయడానికి రావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు ఆర్జీవీ హారర్ సినిమాలతో ప్రేక్షకులని భయపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ల క్రితం నేను భూత్ అనే సినిమా చేశాను. ఆ కథ అంతా ఓ అపార్ట్ మెంట్ లోనే జరుగుతుంది. అది ప్రేక్షకులని ఎంతలా భయపెట్టిందంటే భూత్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ అపార్ట్ మెంట్స్ లోకి వెళ్ళడానికి చాలా కాలం భయపడ్డారు. డీమాంటీ కాలనీ రిలీజ్ అయ్యాక ఆ కాలనీ పేరు పెట్టినందుకు గొడవలు చేసారని డైరెక్టర్ నాకు చెప్పాడు. ఇది ఆల్రెడీ హిట్ అయిన సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తుంది అంతే. నేను ఈ సినిమాని చూడలేదు కానీ తమిళ్ లో చూసిన వాళ్ల దగ్గర నుంచి మంచి టాక్ వచ్చింది. తెలుగులో కూడా డీమాంటీ కాలనీ 2 సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

నిర్మాత బి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. డీమాంటీ కాలనీ 2 అనౌన్స్ అయినప్పటి నుంచి డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారితో ట్రావెల్ అవుతున్నాను. తమిళంలో బిగ్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అవుతుంది. డైరెక్టర్ అజయ్ గారి సినిమాలు బాగుంటాయి. ఆయన మీద నమ్మకంతోనే తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి మాట్లాడుతూ.. డీమాంటీ కాలనీ 2 సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ మాకు ఇచ్చిన నిర్మాత సురేష్ రెడ్డి గారికి, డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు గారికి థ్యాంక్స్. ఈ నెల 15న తమిళంలో ఈ సినిమా విడుదలై అక్కడ హిట్ అయింది. మేము నిన్న థియేటర్ లో ఈ సినిమా చూశాం. ఫోన్స్ కూడా పక్కన పెట్టి చూసేంత ఇంట్రెస్టింగ్ గా హారర్ గా ఈ సినిమా ఉంది అని అన్నారు.

హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు తెలుగు నిర్మాతల నుంచి వస్తున్న సపోర్ట్ కి థ్యాంక్స్. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ కు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ దగ్గర నుంచి వచ్చిన ఆదరణ సంతోషాన్నిస్తోంది. థియేటర్లో హారర్ సినిమా అనుభవాన్ని చూడండి అని తెలిపారు.

డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. డీమాంటీ కాలనీ 2 సినిమాను నేనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను. సినిమాని 2023 జనవరిలోనే షూట్ పూర్తి చేసాం. సినిమా ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చాకే బిజినెస్ డీల్స్ చేయాలని అనుకున్నాను. మా సినిమా కొనేందుకు ఫస్ట్ తెలుగు నుంచి అప్రోచ్ అయిన నిర్మాత సురేష్ రెడ్డి గారు. మా సినిమాలోని ఒక్క సీన్ కూడా చూడకుండా సినిమా మీద నమ్మకంతో మూవీ తెలుగు రైట్స్ తీసుకున్నారు. డీమాంటీ కాలనీ 2కు మేము క్లోజ్ చేసిన ఫస్ట్ బిజినెస్ కూడా తెలుగులోనే. తమిళ్ లో హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ మూవీకి 3, 4 పార్ట్స్ కూడా చేయబోతున్నాను. ఇప్పటిదాకా ఏ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ చూపించలేదు. మేము ఈ మూవీలో టిబెటియన్ యాక్టర్ ను పెట్టి ఆ ప్రయత్నం చేశాం అని తెలిపారు.

డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. నేను డైరెక్టర్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో డీమాంటీ కాలనీ 1 రిలీజైంది. ఆ సినిమాను ల్యాప్ టాప్ లో చూసి ఎన్నోసార్లు థ్రిల్ అయ్యాను. డీమాంటీ కాలనీ 2 సినిమాను తీసుకుంటున్నా అని నా ఫ్రెండ్ సురేష్ రెడ్డి చెప్పినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకోమని చెప్పను. డీమాంటీ కాలనీ 1 కంటే డీమాంటీ కాలనీ 2 పెద్ద హిట్ అవ్వాలి అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు