RGV : పేర్ని నానితో భేటీ తర్వాత కూడా మళ్ళీ వరుస ట్వీట్లు పెడుతున్న వర్మ
నానితో భేటీ తర్వాత కూడా ఆర్జీవీ ట్విట్టర్ లో మళ్ళీ సినిమా సమస్యలపై పోస్టులు చేస్తూనే ఉన్నారు. సినిమా సమస్యల్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇవాళ కూడా వరుస ట్వీట్లు...
- Saketh U
- Published on- January 11, 2022 / 08:56 PM IST
Rgv
RGV : ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఆర్జీవీ కూడా ఇన్వాల్వ్ అయి వరుస ట్వీట్స్ఈ చేసి ఈ అంశం పై మరింత చర్చకి తెర లేపారు. ఇటీవల ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ అయ్యారు. ఈ సమస్యకి పరిష్కారం తెస్తారని అంతా భావించారు. కానీ నానితో భేటీ తర్వాత కూడా ఆర్జీవీ ట్విట్టర్ లో మళ్ళీ సినిమా సమస్యలపై పోస్టులు చేస్తూనే ఉన్నారు. సినిమా సమస్యల్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇవాళ కూడా వరుస ట్వీట్లు చేశాడు. దీంతో నిన్నటి భేటీ అంతగా ఉపయోగపడలేదని అర్ధమవుతుంది.
Unstoppable with NBK : నా లైఫ్‌లో మర్చిపోలేని పాత్ర అది : బాలకృష్ణ
వర్మ చేసిన వరుస ట్వీట్లు
సినిమాల టికెట్ల ధరలకు విధించినట్లే రాష్ట్రంలో ఇంకేదైనా ఉత్పత్తిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందా? ఒక వేళ విధిస్తే ఆ ఉత్పత్తుల పేర్లు, అందుకు కారణాలు చెప్పాలి.
రూ.500 కోట్లతో తీసిన ‘ఆర్ఆర్ఆర్’ రూ.కోటి తీసిన చిత్రంతో ఎలా పోలుస్తారు. చిన్న చిత్రాలతో సమానంగా భారీ చిత్రాల టికెట్ ధర ఎలా నిర్ణయిస్తాం??
సినిమా నిర్మాణ వ్యయంతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం వాదించాలనుకుంటే అదే వాదన ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువుకైనా వర్తిస్తుందా??
పోటీ ఆధారంగానే వస్తువుల నాణ్యత, ధర నిర్ణయిస్తారు. బయటి వాళ్ళని ఆధారంగా తీసుకొని కంపెనీలు ధరలు నిర్ణయించవు.
తక్కువ ధరలకు అమ్మాలని ప్రభుత్వం బలవంతం చేస్తే, అసలు ఉత్పత్తే ఆగిపోవచ్చు. అప్పుడు నాసిరకం ఉత్పత్తులు బయటకు వస్తాయి.
మహారాష్ట్రలో, నార్త్ స్టేట్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ రూ.2,200లకు విక్రయిస్తుంటే, అదే సినిమా టికెట్ ఏపీలో రూ.200లకు కూడా విక్రయించట్లేదు. ఆర్టికల్14 ప్రకారం అది నిబంధనలు ఉల్లంఘించడం కాదా??
టికెట్ల ధరలు, సమయాలు, ప్రదర్శన విషయంలో ప్రభుత్వ జోక్యం తగదు. ఇతర వస్తువుల ధరల విషయంలో లేని ప్రభుత్వ జోక్యం టికెట్లపై ఎందుకు??
రాత్రీ, పగలు థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తే, వచ్చే ప్రమాదం ఏంటి? కొవిడ్ కన్నా ముందు మహారాష్ట్రలో 24/7 సినిమాలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు ఇచ్చింది.
వినియోగదారుడి సమయానుకూలత, పని వేళలు బట్టి సినిమా ప్రదర్శనలు వేయవచ్చు కదా! వాళ్లకు ఉన్న వెసులుబాటు బట్టి అర్ధరాత్రి సైతం సినిమా చూసేలా అవకాశం ఎందుకు ఇవ్వకూడదు??
బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు అధికంగా ఉన్నా, ప్రజలు కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం సమకూరదా??
ఒక నటుడికి నిర్మాత ఎంత పారితోషికం చెల్లిస్తున్నారనే విషయంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటి??
పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర స్టార్స్‌కు ఎందుకంత పారితోషికం ఇస్తున్నారంటే, ఒక వేళ మనం ఐఫోన్ బద్దలు కొడితే అందులో వాడిన మెటీరియల్‌కు అయిన మొత్తాన్ని లెక్కకడితే రూ.1000 కూడా కాదు. కాని రూ.2లక్షలు పెట్టి మనం ఆ ఫోన్ కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్ తయారు చేసిన ఆలోచనకు అంత చెల్లిస్తున్నాం. బ్రాండ్, మార్కెట్ అలా డిమాండ్ చేస్తుంది.
70ఏళ్లుగా అమలు చేస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం 1955ను ఏపీ ప్రభుత్వం తీసి అవతల పారేసింది. దీనిపై కోర్టులో సవాల్ చేయాలి.
ఈ విపత్కర పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమలు సబబే. కాని సినిమాటోగ్రఫీ యాక్ట్‌ను అమలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది??
ఒకవేళ ప్రజలపై ప్రభుత్వానికి మమకారం ఉంటే, ఎవరైతే సినిమా టికెట్‌ను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయలేరో వారికి సంక్షేమ పథకం కింద ప్రభుత్వమే రాయితీ కల్పించి విక్రయించవచ్చు కదా..
నేను చివరిగా చెప్పేది ఒక్కటే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు, థియేటర్లలో షోలు వదిలేసి, భద్రత, పన్నులపై దృష్టి పెడితే బాగుంటుంది.
పేర్ని నాని, ఇండస్ట్రీ పెద్దలు అందరు కూర్చొని ఒక హెల్తీ డిబేట్ పెట్టుకొని ఈ అంశంపై చర్చించాలి. దీనికి పరిష్కారం చూపించాలి.
అలాగే మీడియా కూడా దీన్ని సీరియస్ సమస్యగా తీసుకొని డిబేట్లు పెట్టాలి.. అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
Rajashekar : రియల్ తండ్రి కూతుళ్లు.. రీల్లో కూడా
