Rise of Shantala Song Released from Shantala Movie by Trivikram Srinivas
Shantala Movie : ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతకం పై కె ఎస్ రామారావు గారి సమర్పణలో అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ అశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్ర లో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల. ఈ సినిమా నుంచి మొదటి పాటను ప్రముఖ దర్శకుడు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) నేడు విడుదల చేసారు. పాటను వీక్షించి త్రివిక్రమ్ చిత్రయూనిట్ కి తన శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. మా శాంతల చిత్రం లోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికి మా కృతఙ్ఞతలు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చిత్రికరించాము. నవంబర్ 3న ఈ సినిమాని విడుదల చేయబోతున్నామని తెలిపారు.
Also Read : Boyapati Srinu : పవన్ కళ్యాణ్‌పై డైరెక్టర్ బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?
రైజ్ ఆఫ్ శాంతల క్లాసిక్ సంగీతంతో, సాంప్రదాయ విలువలతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక శాంతల సినిమాకు సీతారామం లాంటి క్లాసిక్ సినిమాకి సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.