Rishab Shetty : ఆ పాత్రతో నటుడిగా కెరీర్ స్టార్ట్.. దశాబ్దాల తరువాత ఆ పాత్రతోనే అంతర్జాతీయ గుర్తింపు.. కాంతార జర్నీ..

ఏ పాత్రని అయితే పోషిస్తూ తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారో.. దశాబ్దాల తరువాత ఆ పాత్రతోనే అంతర్జాతీయ గుర్తింపుని సంపాదించుకున్నారు రిషబ్ శెట్టి.

Rishab Shetty talked about his journey with Kantara Yakshagana

Rishab Shetty : కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా శాండిల్‌వుడ్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. అయితే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చిన సినిమా అంటే ‘కాంతార’. తానే నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం 2022లో రిలీజయ్యి పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం నేషనల్ లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు.

2023లో జరిగిన ఐక్యరాజ్య సమితిలో ఈ సినిమాని ప్రదర్శించిండం గమనార్హం. ఈ స్క్రీనింగ్ కి రిషబ్ శెట్టి కూడా హాజరవ్వడం మరో గొప్ప విషయం. ఇలా ఈ సినిమాతో రిషబ్ శెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో రిషబ్ శెట్టి పంజర్ల వేషధారణలో చేసిన ‘యక్షగాన’ పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ తెప్పించింది. సినిమా విజయంలో ఈ పాత్ర ముఖ్య పాత్ర పోషించింది.

Also read : Pawan Kalyan : పాటొచ్చి 12ఏళ్ళు అయ్యింది.. అయినా పవర్ తగ్గలా.. CSK vs SRH మ్యాచ్‌లో గబ్బర్ సింగ్ మ్యానియా..

అయితే ఈ పాత్రతో రిషబ్ శెట్టి జర్నీ కేవలం కాంతార మూవీ నుంచి మొదలయింది కాదు. దశాబ్దాల క్రితమే రిషబ్ యక్షగానతో ప్రయాణం మొదలుపెట్టారు. అసలు రిషబ్ నటుడిగా మారింది ఈ పాత్రతోనే అంట. రిషబ్ ఆరో తరగతి చదువుతున్న సమయంలో పంజర్ల వేషధారణలో మొదటిసారి యక్షగాన డాన్స్ చేసారు. దానితో ఒక ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ అయ్యిందని రిషబ్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఏ పాత్రని అయితే పోషిస్తూ తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారో.. దశాబ్దాల తరువాత ఆ పాత్రతోనే అంతర్జాతీయ గుర్తింపుని సంపాదించుకున్నారు రిషబ్ శెట్టి. ఈ విషయం పట్ల రిషబ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. కాగా ఆడియన్స్ అంతా ప్రస్తుతం కాంతార సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ప్రీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు