Pawan Kalyan : పాటొచ్చి 12ఏళ్ళు అయ్యింది.. అయినా పవర్ తగ్గలా.. CSK vs SRH మ్యాచ్‌లో గబ్బర్ సింగ్ మ్యానియా..

పాటొచ్చి 12ఏళ్ళు అయ్యింది. అయినా గబ్బర్ సింగ్ పవర్ తగ్గలా. నిన్న జరిగిన CSK వెర్సెస్ SRH మ్యాచ్ బ్బర్ సింగ్ మ్యానియా చూసారా.

Pawan Kalyan : పాటొచ్చి 12ఏళ్ళు అయ్యింది.. అయినా పవర్ తగ్గలా.. CSK vs SRH మ్యాచ్‌లో గబ్బర్ సింగ్ మ్యానియా..

Pawan Kalyan Gabbar Singh mania at CSK vs SRH match video viral

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఆ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. అంతేకాదు ఇప్పటికీ ఈ సినిమా మ్యానియా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ గబ్బర్ మ్యానియా CSK vs SRH మ్యాచ్‌లో కనిపించింది.

గబ్బర్ సింగ్ సినిమాలో ఒక సీన్ మీకు గుర్తుకు ఉండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ విలన్ కి వార్నింగ్ ఇస్తున్న సమయంలో అలీ ఫోన్ ఖుషి సినిమాలోని ‘యే మేరా జహా’ సాంగ్ తో రింగ్ అవుతుంది. ఆ సీన్ లో అలీ ఒక డైలాగ్ చెబుతారు. ‘పాటొచ్చి 10ఏళ్ళు అయ్యింది. అయినా పవర్ తగ్గలా’ అనే డైలాగ్ కి థియేటర్ లో విజుల్స్ పడ్డాయి. అయితే ఇప్పుడు అదే డైలాగ్ ని గబ్బర్ సింగ్ పాటకి సెట్ అయ్యేలా చేసారు తెలుగు ఆడియన్స్.

Also read : Brahmanandam : ఉప్పల్ స్టేడియంలో గచ్చిబౌలి దివాకర్.. వైరల్ అవుతున్న బ్రహ్మి ఫోటోలు..

నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో CSK వెర్సెస్ SRH మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ని ప్లే చేసారు. ఇక ఆ పాటకి స్టేడియంలోని ఆడియన్స్ అంతా రియాక్ట్ అవుతూ.. సాంగ్ ని హమ్ చేసారు. పాటలోని ‘ఏలేలే’ అనే హుక్ లైన్ ని హమ్ చేస్తూ స్టేడియంలో రీసౌండ్ చేసారు. ఇక ఈ సమయంలో ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా స్టేడియంలోనే ఉన్నారు.

దీంతో ఆ దృశ్యాన్ని వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. “ఈ పాట కంపోజ్ చేసినప్పుడు హరీష్ శంకర్ కి ఒకటే చెప్పను. థియేటర్ లో ఈ ‘ఏలేలే’ అనే పదం ఆడియన్స్ నుంచి రీసౌండ్ వస్తుందని చెప్పను. ఈరోజు స్టేడియం మొత్తం ఈ ‘ఏలేలే’ హమ్ చేస్తున్నారు” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్టేడియం వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Pawan Kalyan Gabbar Singh mania at CSK vs SRH match video viral

 

View this post on Instagram

 

A post shared by AIPKF Videos (@aipkf_videoss)